Biscuits: డైజస్టివ్ బిస్కట్లలో
మాములుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది బ్రేక్ ఫాస్ట్ అయినా విందు భోజనమైనా. అలాగే చాయ్-బిస్కట్ (chai Biscuit) కాంబినేషన్ కూడా అందరికీ తెలిసిందే. ఎక్కువమంది ఇష్టపడే కాంబినేషనే ఇది. మీరు డైజస్టివ్ బిస్కట్ల గురించి వినే ఉంటారు. జీర్ణశక్తి బాగా లేని రోగుల కోసం ఈ బిస్కట్లు మార్కెట్లోకి తీసుకు రాబడ్డాయి. ఇవి ఆరోగ్యవంతమైన చిరుతిండిగా మారాయి.కానీ, దీనితో వచ్చిన సమస్య ఏమిటంటే.. ఈ డైజస్టివ్ బిస్కట్లలో ఉన్న చక్కెరలు, కొవ్వు పదార్థాలు, సోడియం, శుద్ధి చేయబడిన పిండిని కూడా మనం తింటున్నాం. ఇది ఆరోగ్యనికి అస్సలు మంచిది కాదు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కావలిసిన మూడు ముఖ్య కారణాలను కూడా వారు వివరిస్తున్నారు.
బిస్కట్లు బూజు
మొదటి కారణం ఏమిటంటే వీటిలో శుద్ధి చేయబడిన పిండి, చక్కెర, కొవ్వు పదార్థాలు, సోడియం వంటివి ఉంటాయి. వీటిలో పీచు పదార్థాలు,విటమిన్లు, ప్రొటీన్లు,(proteins) ఖనిజ లవణాలు సంవృద్ధిగా ఉన్నాయంటూ ఆ ప్యాకెట్స్ పై రాసి ఉంటుంది. అయితే అక్కడ రాసిన గ్రీకు పదాలను బాగా పరిశీలిస్తే ఈ బిస్కట్లకు బానిసలయ్యేలా వీటిలో బాగా రుచిని ఇచ్చే పదార్థాలను కలిపి ఉన్న విషయం చాలా స్పష్టం గా తెలుస్తుంది.రెండొవ కారణం..ఈ బిస్కట్లు వందలాదిగా మనకు అందుబాటులో ఉంటాయి. అందువల్ల కంపెనీలు వీటిని బాగా ప్రాసెస్ చేస్తుంటాయి. ఎప్పుడైనా బిస్కట్లు బూజు పట్టి చెడిపోవడం చూసారా? లేదు కదా దీని వెనుక ఉన్న కారణం ఇదే. బిస్కట్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ప్రాసెస్ చేయడం తో పాటు.. ఇందుకు అవసరమైన మరి కొన్ని రకాల పదార్థాలను ఇందులో కలపడం వంటివి చేస్తుంటారు.
అనారోగ్యకర కేలరీలు
ఇక మూడో కారణం… బిస్కట్లలో ఉండే అనారోగ్యకర కేలరీలు. డైజస్టివ్ బిస్కట్ కనీసం 50 కేలరీలను కలిగి ఉంటుంది. ఇవి ఆరోగ్యవంతమైనవి (healthy) కావు. ఇవి సన్నగా అవడం కోసం మనం చేసే ప్రయత్నాలను పాడుచేస్తాయి. చక్కెరలు, పిండి, సోడియంలలో ఉండే అనారోగ్యకరమైన కేలరీలు మన శరీరానికి అస్సలు అవసరం లేదు. ఇవి ఉండడం వలన మనఆరోగ్యం పాడుచేసే అవకాశాలే ఎక్కువని నిపుణులు తెలియచేస్తున్నారు.