Romance: శృంగార విషయంలో మగవారికి కొన్ని అపోహలు ఉంటాయి. తన భాగస్వామిని సంతోషపెట్టగలనా, లేదా అనే ఆందోళన వారిని వెంటాడుతూ ఉంటుంది. ఆమెను సంతోషపెట్టడం అనే విషయం అతనిపై బరువుగా అనిపిస్తుంది. శృంగార స్వర్గం లో తనతో పాటు తన స్త్రీ ని కూడా పరిపూర్ణం గా అందులోకి తీసుకువెళ్లా గలన లేదా అని ఆందోళన చెందుతుంటారు.. కొన్ని విషయాల గురించి అవగాహన పెంచుకుంటే మీకు ఎలాంటి సమస్యలు ఎదురుకావు అని తెలియచేస్తున్నారు నిపుణులు.
మగవారు అంగప్రవేశం చేయగానే వేగంగా, దూకుడుగా , బలంగా శృంగారం చేయడం ద్వారా మాత్రమే తన సత్తాను చాటుకోగలుగుతామని, దాని ద్వారానే స్త్రీ కి కూడా తృప్తి కలుగుతుంది అని మగవారు చాలా మంది అపోహ పడుతుంటారు. అలా ఆపకుండా శృంగారం చేయడానికి కారణం ఏమిటంటే శృంగారం మధ్యలో ఆపి చేస్తే తన భాగస్వామి కి సత్తా లేదని తన స్త్రీ భావిస్తుంది అనే అపోహే దీనికి కారణం… అంటున్నారు నిపుణులు. అయితే శృంగారం మధ్య మధ్యలో ఆపి ఆపి చేయడం వలన శీఘ్రస్కలనం నివారించి, ఎక్కువ సమయం శృంగారాన్ని చేయడం ద్వారా స్త్రీ మంచి సుఖం పొందుతుంది అని కామశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు . .అలా ఎక్కువ సేపు శృంగారం చేస్తున్నప్పుడు స్కలనం జరుగుతుంది అని అనిపించినపుడు ఆపి, అంగాన్ని యోని నుండి బయటకు తీయాలి. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్లీ అంగప్రవేశం జరపవచ్చు . అంగప్రవేశం ద్వారా సంభోగం చేయడాన్ని కాసేపు ఆపడం వల్ల భాగస్వామి సరిగా చేయలేక పోతున్నారు అని స్త్రీ భావించే అవకాశాలు ఉండవు. శృంగారాన్ని ఆపినప్పుడు ముద్దులు పెట్టడం స్త్రీలోని సున్నితమైన భాగం నిమరడం ద్వారా ఆమెని మరింత రెచ్చగొడితే ఆమెకు సుఖంగా ఉంటుంది అని తెలియ చేస్తున్నారు.
మీరు శృంగారం సరిగా చేస్తున్నారా, లేదా అనేవిషయం మీ భాగస్వామి నుంచి తెలుసుకోవాలనుకుంటే, ఆమెతో బేషజాలు లేకుండా మాట్లాడండి. ఆమెకు ఎలా నచ్చుతుంది అనేది అడిగి తెలుసుకుని ఆ ప్రకారం చేయండి. మగవారికి వీర్య స్కలనం ద్వారా తృప్తి కలుగుతుంది కానీ స్త్రీని తృప్తి పరచడానికి సంభోగం మాత్రమే సరిపోదు. ఆమె శరీరంలోని ప్రతి భాగమూ సుఖప్రాప్తిని కోరుకుంటుంది అని గుర్తించాలి.దానికోసం ఫోర్‌ప్లే చేస్తే చాలు. ఫోర్‌ప్లే చేస్తే అది స్త్రీని మత్తులోకి తీసుకుని వెళ్తుంది. ఆమె ఆ మత్తులో ఉన్నప్పుడు అంగప్రవేశం చేస్తే ఆమెకు చాలా తేలికగా సుఖ ప్రాప్తి కలుగుతుంది . అప్పుడు మీరు ఆమెకు ఎంత వేగంగా ఎంత బలంగా, చేశారన్నది పట్టించుకోదు.