Rooh Afza: రూఫ్ అఫ్జా.. ఇది ఒక రిఫ్రెష్ పానీయం మనకు ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తుంది ఇకపోతే ఈరోజు నుంచి ముస్లిమ్స్ అతి ముఖ్యమైన పండుగ రంజాన్ మొదలు కాబోతోంది.. ఇక ఉపవాసాన్ని ఈ పానీయంతోనే మొదలు పెడతారు ఇక ఈ రంజాన్ లో ఒక గ్లాస్ రూఫ్ అఫ్జా శరీరంలోని వేడిని తగ్గించేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఉపవాసం ప్రార్థనలను సమాజంలో ఉన్న వారితో జరుపుకుంటారు. ముఖ్యంగా ముస్లింలు ఉపవాసం పాటించి అర్ధరాత్రి ఇఫ్తార్ విందుతో ఉపవాసాన్ని విరమించే సమయం ఇది.

సాంప్రదాయకంగా ఇఫ్తార్ ఖర్జూరం కాటు తో మరియు నీరు తాగడం వల్ల ప్రారంభం అవుతుంది. దీని తర్వాత శాకాహారం వంటకాలు తింటారు ఇకపోతే ఇంట్లో ఎన్ని వంటకాలు తయారు చేసినా సరే ఈ పని ఏం మాత్రం తప్పనిసరిగా తీసుకుంటారు . మరి ఈ పానీయం ఎలా తయారు చేస్తారు దీని వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
ఈపానీయానికి కావలసిన పదార్థాలు..
రూఫ్ అఫ్జా (రోజ్ సిరప్)- 5 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – చిటికెడు
నల్ల ఉప్పు – చిటికెడు
మిరియాల పొడి – చిటికెడు
పుదీనా ఆకులు కొన్ని
ఐస్ క్యూబ్స్ కొన్ని
సబ్జా గింజలు నానబెట్టినవి – రెండు టేబుల్ స్పూన్లు
సోడా నీరు
ముందుగా ఒక పెద్ద గ్లాస్ తీసుకొని అందులో పైన చెప్పిన పదార్థాలన్నింటినీ వేసి.. ఇంకొక గ్లాసులోకి అటూ ఇటూ తిప్పుతూ బాగా కలపాలి అంతే ఈ పానీయం రెడీ అయినట్టే.
ఈ పానీయం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే శరీరం డిహైడ్రేషన్ నుండి ఉపశమనం పొందుతుంది హిమోగ్లోబిన్ మెరుగుపడుతుంది. అజీర్ణాన్ని నివారించడంలో.. శరీర వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె సామర్థ్యాన్ని పెంచి గుండెకు రక్త సరఫరా సున్నితంగా అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా విరోచనాలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది