Weight Loss: పువ్వుల పేరు వినిపించగానే గులాబీ మొక్క ఎక్కడ ఉందా అనీ కళ్ళు వెతుకుతూ ఉంటాయి.. ఇక గులాబీ చెట్టు లేని ఇల్లే ఉండదంటే అతిశయోక్తి కాదు.. ఈ గులాబీ తోనే ఎంచక్కా బరువు తగ్గవచ్చు.. అయ్యో మా ఇంట్లో గులాబీ మొక్క లేదు అనుకుంటున్నారా.. కనీసం మీరు దేవుడికి పెట్టే పూలలోనైనా గులాబీ వాడతారు కదా.. ఆ పూలలో ఒక్కటి తీసుకోండి చాలు..! గులాబీలతో బరువు ఎలా తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..!
ముందుగా రెండు గులాబీ పూల ను తీసుకొని వాటి రేఖలను వలిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాసున్నరా నీటిని పోయాలి. అవి గోరువెచ్చగా అయ్యాక గుప్పెడు గులాబీ రేకులను నీటిలో వేయాలి. అందులో 2 యాలుకలను దంచి వేయాలి. ఈ నీటిని 10 నిమిషాల పాటు మరిగించాలి. ఈ టీ కాస్త ఎరుపురంగులో కి వచ్చిన తర్వాత వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఎండిన గులాబీ రేకులతో కూడా ఈ టీ తయారు చేసుకోవచ్చు.
గులాబీ రేకుల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఈ టీ ఆకలి వేయకుండా చేస్తాయి. వరుసగా 15 రోజుల పాటు గోరు వెచ్చని నీటిని తాగితే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. ఉదర సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. మలబద్దకం నివారిస్తుంది. ఈ శరీరంలో అనేక రకాల అన్ని రకాల రుగ్మతలను నివారిస్తుంది.