ఆపిల్, పాలకూర, వాల్నట్స్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామందికీ తెలుసు. విటమిన్ సి, ఖనిజాలు, పొటాషియం వంటి పోషకాలతో “తామర మొక్క కాండం నిండి ఉందని ఎంత మందికి తెలుసు. ఇవి రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతాయి.” అని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించి సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం.
సలాడ్కి కావలసిన పదార్ధాలు.
1 – లోటస్ రూట్, లేదా కమల్ కాక్డి. 2 – యాపిల్స్ ,1 కప్పు చిన్న చిన్నముక్కలుగా తరిగిన పాలకూర
½ కప్ – వాల్నట్స్ , 2 టేబుల్ స్పూన్ల వెన్న,2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం
తయారు విధానం :
1 లోటస్ రూట్ తీసుకొని శుభ్రంగా కడగండి. పై తొక్క తీసి, సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి.లోటస్ రూట్ ముక్కలను 4 నుండి 5 నిమిషాలపాటు ఆవిరికి ఉడకనివ్వండి. ఆపై అబ్సార్బెంట్ కాగితం ఉపయోగించి, ఆ ముక్కల మీది నీటిని తొలగించండి.పాన్లో1 టేబుల్ స్పూన్ బట్టర్ వేసి, ఉడికించిన లోటస్ రూట్ ముక్కలను గ్రిల్ చేయండి. ఆపిల్స్ ముక్కలుగా చేసి, వాటిపై నిమ్మ రసం వేయండి.పాలకూరలో నీరు లేకుండా చూడండి.డ్రెస్సింగ్ కోసం ..1 టేబుల్ స్పూన్ బట్టర్ ను తక్కువ వేడి మీద గోధుమ రంగులోకి వచ్చేవరకు వేడి చేయండి. వాల్నట్స్ వేసి, కొంచం నిమ్మరసం ఎక్కువవేసి టాస్ చేసి, పాన్ డీగ్లేజ్ చేయండి.
ఒక గిన్నెలో పాలకూర, ఆపిల్ ముక్కలు, కాల్చిన లోటస్ రూట్స్ వేసి టాసు వేయండి.సలాడ్ ప్లేట్లోకి తీసుకోండి.ఉప్పు, మిరియాల పొడిని పైన చిలకరించండి.అంతే ఎంతో టేస్టీగా ఉండే సలాడ్ రెడీ అయినట్లే. ఇది ఎంతో హెల్దీమాత్రమే కాదు.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.