హెల్త్

Salt: ఉప్పును ఇలా వాడితే మీ అందం చెక్కుచెదరదు తెలుసా…??

Share

Salt: ఉప్పు లేనిదే అసలు ఏ కూరకు అయిన రుచి ఉండదు. వంటగదిలో ఉప్పు లేనిదే అసలు వంటే ఉండదు. నిత్యం మన జీవితంలో ఉప్పు అనేది ఒక భాగం అయిపోయింది. అయితే ఉప్పు కేవలం కూరల్లో రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తాం అనుకుంటే పొరపాటు పడినట్లే. ఉప్పును ఇలా కూడా ఉపయోగించవచ్చు అని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఉప్పును సౌందర్య సాధనంగా కూడా మనం ఉపయోగించవచ్చు తెలుసా.. అవును మీరు విన్నది నిజమే ఉప్పును చర్మం,జుట్టును ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవ‌డానికి కూడా ఉపయోగించుకోవచ్చు.

Salt: ఆ సమయం లో విస్తరిలో ఉప్పు మాత్రం వేయకూడదట??

Salt: ఉప్పుతో అందంగా మారడం సాధ్యమేనా..?

స‌హ‌జ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో,అతి త‌క్కువ ఖ‌ర్చుతో మన వంట గదిలో ఉండే ఉప్పు ద్వారా చ‌ర్మాన్ని, జుట్టును కాపాడుకోవచ్చు.మరి అది ఎలాగో.. ఏంటో అనే విషయాలు తెలుసుకుందామా.!

ఉప్పు వాడ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి. ఫలితంగా చ‌ర్మం పొడి బార‌కుండా ఉంటుంది. అలాగే త‌ల స్నానం చేసేట‌ప్పుడు ఉప్పును జుట్టుకు రాసుకోవడం వ‌ల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.జుట్టు పెరుగుద‌ల‌కు ఉప్పు ఎంత‌గానో సహాయ‌ప‌డుతుంది. అలాగే తలలో చుండ్రు స‌మ‌స్య‌ కూడా తగ్గుతుంది.

Salt -Tumeric : పసుపు ,ఉప్పు విషయం లో ఈ మాట అసలుపొరపాటున కూడా  వాడకండి? వాటి విషయం లో ఈ జాగ్రత్తలు పాటించండి!!
ముఖాన్ని అందంగా ఉంచడంలో ఉప్పు పాత్ర :

అలాగే ఉప్పును ఫేస్ మాస్క్‌లా కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు.అది ఎలా అంటే ముందుగా 4 టీ స్పూన్ ల తేనెను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో 2 టీ స్పూన్‌ల ఉప్పు వేయాలి. ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పొడి చ‌ర్మంపై ఒక మాస్క్ లా వేసుకుని ఒక. పావుగంట పాటు అలానే ఉంచాలి ఆ త‌రువాత నీటితో క‌డిగేయాలి. ఉప్పు చర్మాన్ని పొడి బారకుండా చేస్తుంది.ఇలా త‌రచూ చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.అలాగే ఉప్పుని స్క్ర‌బ‌ర్ లా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు అది ఎలా అంటే కొబ్బ‌రి నూనెలో కొద్దిగా ఉప్పును వేసి ఈ మిశ్ర‌మాన్ని శ‌రీరంపై రుద్ద‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే మృత క‌ణాలు తొలగిపోతాయి.అంతేకాకుండా ఉప్పు చ‌ర్మం పొర‌ల్లో ఉండే బ్యాక్టీరియాను చంపి మొటిమ‌లు రాకుండా చేస్తుంది. ముందుగా కొద్దిగా హాట్ వాటర్ తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి స్ప్రే బాటిల్ లో పోసి ముఖంపై స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి

Salt -Tumeric : పసుపు ,ఉప్పు విషయం లో ఈ మాట అసలుపొరపాటున కూడా  వాడకండి? వాటి విషయం లో ఈ జాగ్రత్తలు పాటించండి!!
జుట్టు పెరుగుదల విషయంలో ఉప్పును వాడవచ్చా..?

జుట్టు పెరుగుద‌ల‌కు ఉప్పు ఎంత‌గానో స‌హాయప‌డుతుంది. ముందుగా మీరు త‌ల స్నానం చేసేట‌ప్పుడు త‌ల‌కు ఉప్పుతో ఒక 15 నిమిషాల పాటు మ‌సాజ్ చేసి ఆ త‌రువాత శుభ్రంగా నీటితో క‌డిగేసి త‌ల స్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగడంతో పాటు తలలో ఎమన్నా చుండ్రు లాంటివి ఉంటే తగ్గుతాయి.అయితే ఇలా ఉప్పుతో రోజు తల స్నానం. చేయకండి.వారానికి రెండు సార్లు మాత్రం క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది


Share

Related posts

Diabetes: ఈ మామిడి తింటే షుగర్ తగ్గుతుంది. ఈ కాయ రేటు తెలిస్తే నోరెళ్ళబెడతారు..!

bharani jella

Fruits: పండ్లను ఇలా తింటేనే ఆరోగ్యం..!! ఇలా అస్సలు తినకూడదు..!! 

bharani jella

బ్రెస్ట్ కాన్సర్‌తో గుండెకు లింక్!

Siva Prasad