కాన్సర్ కణాలు చాలా టక్కరివి. అవి శరీరంలోని శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో మైలోయిడ్ కణాలు ముఖ్యమైనవి. ఇవి రకరకాల సూక్ష్మజీవుల బారి నుంచి కూడా శరీరాన్ని కాపాడతాయి.
కాన్సర్‌కు గురయిన కణాలపై యుద్ధం చేయడం కూడా మైలోయిడ్ కణాల డ్యూటీనే. అయితే కాన్సర్ కణాలు తామే బాధిత కణాలు అన్నట్లుగా మైలోయిడ్ కణాలను మోసగిస్తాయి. ఫలితంగా మైలోయిడ్ కణాలు శరీరంలోని కాన్సర్ కణాలను సంహరించాల్సింది పోయి అవి పెంపొందేందుకు దోహదపడతాయి.
కాన్సర్ కణాల ఈ మోసాన్ని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు ఒక దారి కనుగొన్నారు. షికాగోలోని రష్ మెడికల్ కాలేజి ప్రొఫెసర్ వినీత్ గుప్తా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని మూర్స్ కాన్సర్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ జ్యుడిత్ వార్నర్ నాయకత్వంలో ఈ పరిశోధన జరిగింది. పరిశోధన ఫలితాలను నేచుర్ కమ్యునికేషన్స్ జర్నల్‌లో ప్రచురించారు.
జన్యుమార్పిడి చేసిన రెండు రకాల ఎలుకలను ఉపయోగించి కాన్సర్ కణాలు రోగనిరోధక వ్యవస్థను ఎలా మోసం చేసేదీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మైలోయిడ్ కణాలు కాన్సర్ కణాలపై పోరాడే విధంగా తయారు కావడానికి సిడి11డి అనే ప్రొటీన్ ఉపయోగపడుతుంది. దీని ప్రభావం వల్ల తయారయ్యే ఎమ్1 అనే మరోరకం కణాలు కాన్సర్ సెల్స్‌పై దాడి చేస్తాయి. వీటిబారి నుంచి తప్పించుకునేందుకు కాన్సర్ కణాలు సిడి11డిని మోసం చేసి ఎమ్1ను కాకుండా ఎమ్2 అనే మరో రకం కణాలను తయారు చేయిస్తాయి.
ఇలా జరగకుండా ఈ ప్రక్రియను అడ్డుకునే ఒక అణువును శాస్త్రవేత్తలు గుర్తించారు. ల్యూకాథెరిన్ -1 అనే ఈ అణువు కాన్సర్ కణాల మోసాన్ని సమర్ధవంతంగా నిరోధించగలదని గుర్తించారు. అయితే అన్ని రకాల కాన్సర్‌కూ ఇది పనికిరాదని వారు అంటున్నారు.
రోగనిరోధక వ్యవస్థను
కూడా మోసం చేయగలవు. శరీరంలోని మైలోయిడ్ కణాలను మోసం చేయడం అందులో భాగం. మానవ
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.