ఆ రంద్రం వెనుక ఉన్న రహస్యం…ఎప్పుడైనా ఆలోచించారా??

బిస్కెట్ల ని ఇష్టం గా  తినే వారు చాలా మందే ఉంటారు..  కాబట్టి బోర్బొన్ బిస్కెట్లు కూడా  చాలామందికి తెలిసే ఉంటాయి. ఈ బిస్కెట్లనితయారు చేసి మనకు అందుబాటులోకి వచ్చి  ఎన్నో సంవత్సరాలు అయినా కూడా ఇంకా అమ్మకాలు  అలానే కొనసాగడానికి కారణం  బిస్కెట్ల లో ఉండే రుచి. ఎక్కువ తియ్య గా లేదా మరీ చేదుగా కాకుండా ఒక మధ్యరకమైన రుచి తో  ఉంటాయి.

ఆ రంద్రం వెనుక ఉన్న రహస్యం...ఎప్పుడైనా ఆలోచించారా??

ఈ బిస్కెట్ లో ఉండే  క్రీం ఇంచుమించుగా  చాక్లెట్ తిన్న అనుభూతిని ఇస్తుంది.  ఇలాంటి రుచి మిగతా బిస్కెట్ల లలో ఎక్కడ మనకు తగలదు . ఈ బిస్కెట్ ని తినేటప్పుడు మనము ఒక విషయాన్ని గమనిస్తాము… అది ఏమిటంటే  బిస్కెట్ కి మధ్య మధ్యలో చిన్న చిన్న రంధ్రాలుఉంటాయి. అవి ఎందుకు అన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ  రంధ్రాలు ఉండడం వెనుక కూడా ఒక విషయం ఉంది.

మెక్ విటీస్  అనే  సంస్థ  ఈ బిస్కెట్లను తయారు చేస్తుంది.  కార్లీసిల్ లో దాని బ్రాంచ్ ఒకటి ఉంది. అందులో పనిచేసే టీం మేనేజర్  మార్క్ గ్రీన్వేల్ ఆ కారణం గురించి వివరించారు . “బిస్కెట్లు తయారు చేసేటప్పుడు వేడిగా ఉంటాయి. ఒకవేళ  ఆ  వేడితో నే ప్యాకింగ్ చేసేస్తే లోపల ఉన్న వేడి ఆవిరిగా మారి క్రీం కరిగిపోయి , బిస్కెట్లు మెత్తబడి పోవడంతో పాటు విరిగిపోవడంజరుగుతుంది.

అలా  రంధ్రాలు ఉంచడం  వల్ల గాలి బయటికివచ్చేసి బిస్కెట్లు మామూలుగా ఉంటాయి.. అని తెలిపారు. అలా ఒక్కొక్క బిస్కెట్ కి 10 రంధ్రాలు వరకు మనకు కనిపిస్తాయి ..  ఈ సంస్థ తయారు చేసే జింజర్ బిస్కెట్లు కూడా బాగా వాడకం లో ఉన్నాయి . అవి పగుళ్ల తో తేలికగా  విరిగి పోయేలా అనిపిస్తాయి . దాని వెనుకున్న  కారణంమీకు అర్థమయ్యే ఉంటుంది. రంధ్రాలు లేకపోవడం వల్ల వేడి వేడితో  అలాగే ఉండి పోవడం వలన  జింజర్ బిస్కెట్ల కు పగుళ్లుఏర్పడి  ఉంటాయి .  కానీ దేని ప్రత్యేకత దానికి ఉంటుంది … రుచికూడా అంతే …