ఆడవారి కాళ్ళకు పట్టిలు అందాన్ని ఇవ్వడం తో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి . పట్టీలనుపెట్టుకోవడం వల్ల అవి స్త్రీ లమడమలను తాకుతూ ఉంటాయి. ఇలాతాకడం వల్ల వారి కాలి ఎముకలు ధృఢంగా ఉంటాయి. కాళ్ళ పట్టీల నుంచి వచ్చే మువ్వల శబ్దం ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది.
కాళ్ళకు పట్టీలు పెట్టుకుని నడుస్తున్నపుడు ఇంట్లో ఘల్లు ఘల్లు మని వచ్చే సవ్వడి తో దేవతలకు ఆహ్వానం పలికినట్టేనని పురాణాలు చెబుతున్నాయి. పట్టీల తో నడుస్తున్నప్పుడు వచ్చే సవ్వడి ఇంటికి ప్రత్యేక అందాన్ని ఆనందాన్ని తెస్తుంది. ఇంకా చిన్నపిల్లల ఆటలప్పుడు కాళ్ళకున్న మువ్వల పట్టీలు చక్కని శబ్ధాన్నిస్తూ ఇంటికి ఒక కొత్త సందడిని తెస్తాయి .
అయితే కాళ్ళ పట్టీలు ఇప్పుడు ఎన్నో రకాలలో మన దృష్టిని ఆకర్షిస్తున్నాయి .గిల్ట్ పట్టీలు వెండి పట్టీల్లా అని భ్రమ పడే వైట్ మెటల్ రకాలు ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చాయి. నమ్మకమున్న షాపుల్లోనే పట్టీలు కొనడం మంచిది. రోజూ వారి పట్టీలు వెండితో సన్నని డిజైన్తో చేసినవి, మరీ బరువుగా ఉండేవి కాకుండా తేలికగా ఉండేవి తీసుకోవాలి.
వెండి పట్టీలను టూత్ పేస్ట్ లేదా కుండికాయ రసం లేదా ముగ్గు తో తోమితే నలుపురంగు పోయి మళ్ళీమెరుపు వస్తుంది. బంగారు పూత తో ఉండే పట్టీలు ప్రత్యేక సందర్భాల్లోపెట్టుకుంటే బాగుంటాయి. కొంత వయస్సు దాటాక అంటే పాతికేళ్ళు దాటిన తరువాత గజ్జెల పట్టీలు ధరించడం బాగుండదు. తక్కువగా సవ్వడి చేసే మువ్వల పట్టిలు పెట్టుకుంటే బావుంటుంది.
పెళ్లి లేదాపేరంటానికి పెద్ద డిజైన్ పట్టీలుపెట్టుకుంటే బాగుంటుంది. ఆఫీసుకి వెళ్ళేటప్పుడు మీటింగ్ ఉన్నప్పుడు శబ్ధం రాని పట్టీలు పెట్టుకోవాలి. రెండుకాళ్ళ పట్టీలను విడి విడి గా పొట్లాలు కట్టి ఉంచితే చిక్కుపడడం లేదా ఇరుక్కుపోవడం వంటివి జరగవు. సులభంగా తీసుకుని ధరించవచ్చు. మువ్వలుకూడా ఊడిపోకుండా ఉంటాయి.