ఈ మధ్య కాలం లో బ్రెడ్ వాడకం ఎక్కువయిదని చెప్పాలి. ఇదివరకు ఏ జ్వరం వచినప్పుడో తినేవాళ్ళం. కానీ ఇప్పుడు బ్రెడ్ తో రకరకాల వంటకాలు తయారు చేసుకొని మరీ తింటున్నాం. అయితే… ఓ వ్యక్తి తన బెకరీలో బ్రెడ్ ఎలా తయారు చేస్తుందో తెలిస్తే.. మళ్లీ దాని జోలికి కూడా పోరు.
పబ్లిక్ టాయ్ లెట్లలో అమ్మాయిల మూత్రం సేకరించి, దానిని బ్రెడ్ తయారీలో వినియోగించింది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఫ్రెంచ్ లో బేకరీ వ్యక్తి ఈ విధంగానే బ్రెడ్ తయారు చేసింది. అలా చేయడానికి కారణం ఉందని చెప్పడం గమనార్హం. సదరు బేకరీ నిర్వహాకురాలి పేరు లూయిస్ రాగెట్. ఈమె బేకరీలో బ్రెడ్ అక్కడ చాలా ఫేమస్. ఇటీవల దాని గురించి అడగగా ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఆమె ఆ బ్రెడ్ తయారీలో యూరిన్ ఉపయోగించారు అన్న విషయం తెలిసిన తర్వాత చాలా మంది షాకయ్యారు. అయితే… యూరిన్ గొప్ప ఎరువులాంటిదని ఆమె పేర్కొన్నడం గమనార్హం. మానవ వ్యర్థాలపై నిషేధాన్ని విచ్ఛిన్నం చేయడం, స్థిరమైన ఆహార చక్రాన్ని ప్రోత్సహించడం తన లక్ష్యం అని చెప్పారు. టాయిలెట్‌కి వెళ్లడం అనేది ఆహార సామర్థ్యాన్ని కాలువలో పడేయడం లాంటిదని ఆమె పేర్కొనడం విశేషం.ఈ యూరిన్ ని అందరూ నిర్లక్ష్యంగా,వ్యర్థం లాగా వదిలేస్తున్నారని… కానీ దానిని బంగారు గనిలా చూడాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.మూత్రంలో నత్రజని, పొటాషియం మొక్కలు నేల నుండి సేకరించే అనేక పోషకాలు ఉన్నాయని ఆమె చెప్పారు. అందుకే దానిని తాను బ్రెడ్ తయారీలో వినియోగించానని ఆమె చెప్పడం విశేషం.ఫ్రెంచ్ అర్బన్ ప్లానింగ్ ఏజెన్సీ ఇటీవల చేసిన అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ సుమారు 29 మిలియన్ బ్రెడ్ ని మూత్రం వినియోగించి తయారు చేసినట్లు తేలింది. మరి ఇలాంటి బ్రెడ్ మీరైతే రుచి చూస్తారా..?