short person: పొట్టిగా ఉన్నాను అని  బాధపడుతున్నారా?? అయితే  ఇది తెలుసుకోండి !! (పార్ట్ -1)

Share

short person: : మీరు  పొట్టిగా ఉన్నారని  బాధ పడుతున్నారా?అసలు  అలాంటి  ఆలోచన మీ  మైండ్ నుండి తీసేయండి. ఎందుకంటే పొడవుగా ఉన్న వారి కంటే పొట్టిగా ఉన్నవారు  ఎక్కువ అందంగా ఉంటారు అన్న  విషయం గుర్తు పెట్టుకోండి. అయినా  కూడా కొంచెం పొడవుగా కనిపిస్తే బాగుండు అని అనుకునేవారు  కొన్ని చిట్కాలు  పాటించి ఆ కోరిక తీర్చుకోండి. పొట్టిగా ఉన్నవాళ్లు పొడవు గా కనబడడానికి  చాలా మార్గాలున్నాయి. పొడవుగా ఉన్న వారు పొట్టిగా కనిపించడానికి ఎలాంటి మార్గం లేదు.  పొడవుగా కనిపించేందుకు ఏమి చేయాలో చూద్దాం.

సహజంగా  మనిషి ఎత్తు  వంశ పరంగా వస్తుంది. తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా  అలాగే ఉంటారు. ఈ విషయంలో చేయడానికి ఏమి ఉండదు. ఎత్తుగా  లేమని బాధపడేవారు నిల్చున్నప్పుడు నిటారుగా ఉండడం. నిటారుగా కూర్చోవడం వల్ల పొడుగ్గా కనిపిస్తారు. వంగినట్టు ఉండడం వలన మరింత పొట్టిగా కనిపించే అవకాశం ఉంది.మీ వంశ పరంగా ఉండే లక్షణాలను బట్టే మీరు ఉంటారు అన్న విషయాన్ని మర్చిపోకండి.
మనం వాడే  కొన్ని దుస్తులు లను బట్టి  కూడా పొడుగ్గా కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . ముఖ్యంగా అడ్డగీతలు ,గళ్ల గీతాలు , ఉన్న వస్త్రాలు ఉన్న పొడవు ను తగ్గించి ఇంకా గట్టిగా ఉన్నట్టు అనిపించేలా చేస్తాయి.

రంగురంగుల కాకుండా ఒకే రంగు ఉండే దుస్తులు  వేసుకోవడం వల్ల పొడుగుగా కనిపించే అవకాశం ఉంది. అడ్డంగా ఉండే డిజైన్లు కాకుండా నిటారుగా ఉండే డిజైన్లు పొడుగ్గా కనిపించేలా చేస్తాయి.చాలామంది గాలి ఆడటానికి  వీలుగా వదులు గా ఉండే దుస్తులు ధరిస్తారు. ఇలాంటి బట్టలతో మరింత పొట్టిగా కనిపిస్తారు. బిగుతుగా ఉండే బట్టలు  వేసుకోవడం వల్ల ఎత్తుగా  ఉన్నట్టు కనిపిస్తారు. ముఖ్యంగా టీషర్టు, జీన్స్‌ బిగుతుగా ఉన్నవి ధరిస్తే పొడవుగాకనిపించే అవకాశం ఉంది .


Share

Related posts

ఇన్‌స్టాగ్రామ్‌ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Kumar

నడకలో వేగం కూడా ముఖ్యమే!

Siva Prasad

Diabetes షుగర్ ఉన్నవారు తేనే తీసుకోవచ్చా??

Kumar