ప్రస్తుత కాలం లో ఎక్కువమంది ఎదురుకుంటున్న సమస్యల్లో అతి ముఖ్యమైనది అధికబరువు. ఈసమస్య నుండి బయట పడడానికి ఎంతో మంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.. వాటిలో భాగం గా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. అందులో ఒకటి కిటో డైట్స్. పాపులర్ కీటో డైట్ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు.
ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును తేలికగా తగ్గిస్తుందని నమ్ముతారు. చాలామంది ఇదే డైట్ గుడ్డిగా అనుసరించేస్తూ ఉంటారు. తక్కువ మోతాదులో కార్బొహైడ్రేట్లు, కిటోన్స్, ప్రోటీన్లు, హైప్యాట్ డైట్ తీసుకోవడం ద్వారా ఈజీగా బరువు తగ్గించుకోవచ్చునని చాలామంది అంటుంటారు. కానీ, ఈ డైట్ అంతా చెత్త డైట్ ఇంకొకటి లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆహారం లో కార్బోహైడ్రేట్లు తీసుకోకపోవడాన్ని కిటో డైట్ అంటారు. కార్బోహైడ్రేట్లు తీసుకోక పోవడం వలన త్వరగా బరువు తగ్గుతారని చెబుతారు. అయితే, ఈ డైట్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల ని ఎదురుక్కోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే.. కార్బోహైడ్రేట్స్ అసలు తీసుకోకూడదు కాబట్టి.. ఆ ఆహారాన్ని పూర్తి గా పక్కన పెట్టేయవలిసి ఉంటుంది. అలా చేయడం వల్ల త్వరగా అలసిపోతారు.
జీర్ణక్రియ తగ్గడం వలన మలబద్ధకం సమస్య కూడా వస్తుంది. జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. కిటో డైట్లో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన, రక్తం లో ప్రోటీన్ నిల్వలు అధికమై, నెమ్మదిగా రక్తపోటు, గుండెసమస్యలకి దారితీస్తాయి. కిటోడైట్ ప్రారంభించాలి అనుకునే వారు ముందుగా వైద్యున్ని సంప్రదించడం మంచిది .
ప్రత్యేకించి టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లు ఈ విషయం లోచాల జాగ్రత్తగా ఉండాలి. కిటోజెనిక్ డైట్ లేదా సాధారణ డైట్ ఏది చేయాలన్న వైద్య నిపుణుల సలహా తీసుకోవడం అనేది చాల అవసరం. ఎందుకంటే..అందరి శరీరం పని తీరు ఒకేలా ఉండదు . శరీర తత్వాన్ని బట్టి డైట్ పాటించాల్సి ఉంటుంది. వైద్యుని సలహా సూచనలతో నే డైట్ పాటిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.