Spanish: ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. అందుకే వైద్యులు వీటిని తినమని సిఫార్సు చేస్తారు.. తినమన్నారు కదా అని ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ముప్పేనట.. ముఖ్యంగా పాలకూర రోజులో ఎక్కువ సార్లు తినకూడదట.. ఒకవేళ తింటే ఎటువంటి అనర్ధాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలకూర ను రోజులో మూడు పూటలా తినకూడదు. రోజులో ఏదో ఒక పూట ఒక అరకప్పు కూర తింటే చాలు. మనకు కావలసిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అదే రెండు లేదా మూడు సార్లు తినడం వలన విష ప్రభావం చూపుతుంది. పాలకూర లో ఉండే ఆక్సాలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. దీనిని మోతాదు కు మించి తింటే శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఇంకా ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యలు వస్తాయి. పాలకూర లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రోజులో ఎక్కువ సార్లు తీసుకుంటే
గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట, తిమ్మిర్లు రావచ్చు.

కీళ్ల నొప్పులు, వాపులు ఉన్న వారు సాధ్యమైనంత వరకు పాలకూర తినకపోవడమే మంచిది. అలాగే మీ వంశపారంపర్యంగా కిడ్నీ రాళ్ల సమస్య ఉండే పాలకూర ను తక్కువగా తినాలి. లేదంటే కిడ్నీ లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా రక్తం పలచగా అవ్వడానికి మందులు వాడేవారు కూడా పాలకూర ను మితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ కె ఉంటుంది. ఇది రక్తం పలుచన చేసే ముందులతో కలిసి ప్రతిచర్య చేయవచ్చు. పాలకూర ను ఎక్కువగా తింటే అలర్జీ కూడా వస్తుంది. అందువలన రోజుకు ఒక్కసారి అది కూడా ఒక అరకప్పు మాత్రమే తినండి. మేలైన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.