Hand Bands: గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది రాగి లేదా వెండితో తయారుచేసిన కంకణాలను చేతులకు ధరిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది వెండి లేదా రాగితో తయారుచేసిన రాఖీలను కూడా రక్షాబంధన్ సమయంలో ఉపయోగిస్తున్నారు. రాగి , వెండి ఈ రెండు లోహాలు కూడా మనిషి ఆరోగ్యానికి ఎంత మంచి ప్రయోజనాలను కలిగిస్తాయో అందరికీ తెలిసిందే. అయితే వీటి వల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలు కూడా ప్రభలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొంతమంది రాగి లేదా వెండితో తయారుచేసిన ఆభరణాలను ధరించడం వల్ల ఆ ప్రదేశంలో రాగి నుండి విడుదలయ్యే లవణాల వల్ల చర్మం నీలం లేదా ఆకుపచ్చగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాదు కొంతమందికి చర్మ సంబంధిత వ్యాధులతో పాటు అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుందట. ఇక రాగి లోహంతో తయారు చేసిన ఉంగరాలు, బ్రేస్లెట్ లాంటివి ధరించడం వల్ల వీటిలో ఉండే లవణాల కారణంగా కొంతమందికి ఆ ప్రదేశంలో చికాకులు, దద్దుర్లతో పాటు బొబ్బలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఇలా ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని లేకపోతే వీటిని ధరించకపోవడం మంచిది అని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మెటల్ అలర్జీతో బాధపడేవారు ఇలాంటి రాగి , వెండితో తయారుచేసిన ఆభరణాలను ధరించకపోవడం మంచిదట. మరి ముఖ్యంగా రాగి బ్రేస్ లెట్ ధరించినప్పుడు ఆ ప్రదేశంలో చర్మంపై ఆకుపచ్చగా మారినప్పుడు లేదా దద్దుర్లు లాంటివి వచ్చినప్పుడు వెంటనే తొలగించి పలు జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే ఆ ప్రదేశంలో చర్మం మరింత నష్టానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుందని సమాచారం. మరికొంతమందికి వెండి ఆభరణాలు ధరించినప్పుడు అవి త్వరగా నల్లబడిపోతూ ఉంటాయి.. కారణం వారి శరీరంలో వేడి కారణంగా అవి నల్లబడుతూ ఉంటాయని చెబుతారు. అయితే వీటిని ధరించినప్పుడు చర్మం కూడా నల్లబడే అవకాశం ఉంది కాబట్టి వీటిని ధరించినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని .. ఇక చర్మ అలర్జీలు వచ్చేవారు ధరించకపోవడం మంచిది అని సమాచారం.