ఆధునిక జీవన విధానం లో ఫ్యాషన్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సాంప్రదాయ దుస్తులను పక్కన పెట్టి మోడ్రన్ దుస్తులకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అయితే ఇటీవల కాలంలో చాలా మంది ఆడవారు, మగవారు కూడా, టైటుగా ఉన్న డ్రెస్ లు వేయడానికే ఇష్టపడుతున్నారు. ఇవి వేసుకోవడం వల్ల అందంగా కనిపిస్తారని, ఒంటికి బాగా అతుక్కు పోయినట్టుగా ఉండేవి తీసుకుంటున్నారు. కానీ, ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఒంటికి అతుక్కుని ఉండే డ్రెస్సులతో అనేక ఇబ్బందులు ఉంటాయి. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి.. టైట్ బట్టలు వేసుకోవడం వల్ల కండరాలు పట్టేసినట్లుగా ఉంటుంది.టైట్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో ఊపిరి ఆడడం కూడా కాస్తా కష్టంగా ఉంటుంది. కూర్చోవడం, నిల్చోవడం, నడవడం ఇలా ప్రతి ఒక్క పని చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవారిలో మరీ కష్టంగా ఉంటుంది, వారి కాళ్ళు రాసుకుపోవడం, తొడ భాగాల్లో నొప్పులు రావడం, దీని వల్ల నరాలపై ఒత్తిడి పడడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీని ప్రభావం వెన్నుపూసపై కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా స్కిన్ టైట్, షార్ట్స్ వేసుకున్నప్పుడు కండరాలు, జాయింట్స్ పట్టేసినట్లుగా ఉంటాయి. దీంతో బాడీ పెయిన్స్ తీవ్రంగా పెరుగుతాయని అంటున్నారు. అలాగే టైట్ డ్రెస్సులు వేసుకోవడం వల్ల ప్రదానం గా సంతాన సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మగవారిలోబిగుతుగా ఉండే జీన్స్ ప్యాంట్లు గంటలకొద్దీ వేసుకుని ఉండటం,చాల ప్రమాదకరమని క్రోమోజోమ్ల సంఖ్య తక్కువ అవుతాయని.. దీని వల్ల సంతాన సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా.. ఇక ఆడవారు టైట్ గా ఉండే బ్రాలు, లోదుస్తులు ధరించడం వలన వీరికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఎన్నో పరిశోధనల తర్వాతే ఈ విషయం వెల్లడించారు నిపుణులు. కాబట్టి, టైట్ డ్రెస్సెస్ వేసుకోవడం కన్నా.. సౌకర్యవంతమైన లూజ్ బట్టలు వేసుకోవడం శరీరానికి సౌకర్యం ఆరోగ్యానికి మంచిది.