Sleep: ఒకప్పుడు చిన్న పిల్లలు అన్నం తినకపోతే ఆకాశంలో ఉన్న చందమామను చూపించి చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాట పాడి మరి వాళ్ళకి అన్నం. తినిపించే వాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలకు అన్నం తినిపించాలంటే మొబైల్ ఫోన్ ఇస్తే చాలు అన్నం తినేస్తున్నారు. అప్పట్లో పిల్లలను నిద్రపుచ్చడానికి వాళ్ల పక్కన పడుకుని జోలపాట పాడుతూ వాళ్ళను నిద్రపూచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడో ఫోన్ ఇచ్చి వాళ్ళని వదిలేస్తే చాలు రాత్రనక పగలనక ఎంతసేపు కావాలంటే అంత సేపు ఫోన్ చూసి ఎప్పుడో గాని నిద్రపోరు. కాలం మారుతుంది.. కాలంతో పాటు మనిషి జీవనశైలి, ఆలోచనలు కూడా మారుతున్నాయి. మంచి నేర్చుకోకపోయినా పర్వాలేదు గాని చెడు అలవాట్ల జోలికి పోకుండా ఉంటే మంచిది.
Sleep: గాఢనిద్ర కోసం ఈ టిప్స్ పాటించండి చాలు..!!
Sleep: నిద్రలేమి సమస్య :
ఎందుకంటే ఈ కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారు.అప్పట్లో పిల్లలు 8 లేదంటే 9 గంటలకు హాయిగా నిద్రపోయేవారు కానీ ఇప్పుడు మనతో పాటు పిల్లలు కూడా రాత్రి 11 గంటల వరకూ మేల్కొనే ఉంటున్నారు. ఒక పక్క స్కూల్లో హోంవర్కులు, ఇంటికి వచ్చాక ఫోన్ చూడడం చేస్తున్నారు. ఇక యువత దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు నిద్రలేమితో తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారు.కావాలనే అనారోగ్యాలను కొని మరి తెచ్చుకుంటున్నారు.ప్రతి మనిషికి సకాలంలో నిద్రపోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో కొద్దిసేపైనా నిద్రపోయే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ఉంటున్నారు.కాళీ సమయాల్లో మొబైల్ చూడడం,టీవీ చూడడం చేస్తున్నారు గాని నిద్రకు అవకాశం ఇవ్వడం లేదు. రాత్రి పూట పని చేస్తూ ఎక్కువ సేపు మెలుకువగా ఉంటున్నారు. ఇలా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు ఎద్కుకోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హేచ్చరిస్తున్నారు.
Sleep: నిద్ర ఎవరికి ఎక్కువ అవసరం మహిళలకా..!? పురుషులకా..!?
నిద్ర ఎన్ని గంటలు పోవాలంటే..?
కంటినిండా నిద్ర ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు.రోజుకు 7 నుంచి 8 గంటల పాట నిద్ర పోవాలని అంటున్నారు వైద్యులు.8 గంటల నిద్ర సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం రోజంతా ఉంటుంది.నిద్ర సరిగ్గా లేకపోతే మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. రక్తప్రసరణ విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయి.. దీని ఫలితంగా..గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి..అంతేగాకుండా సరిగ్గా నిద్రపోని వారు బరువు పెరగే అవకాశం కూడా ఉంది.నిద్ర లేకపోవడంతో ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం జరుగుతుంది..
మంచి నిద్ర వల్లే కలిగే లాభాలు :
మంచిగా నిద్ర పోతే ఎటువంటి నిరాశ,ఒత్తిడి ఉండవు.అలాగే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.మంచి నిద్ర గుండెకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అలాగే సమయానికి నిద్రపోతే పనిపై ఏకాగ్రత్త కూడా పెరుగుతుంది.అలాగే జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.
మంచి నిద్ర కోసం ఏమి చేయాలంటే?
ముందుగా మంచి నిద్ర కోసం మీరు ఒక షెడ్యూల్ను కేటాయించుకోండి. సరిగ్గా ఆ సమయానికి ప్రతి రోజు నిద్ర పోవాలని నిర్ణయం తీసుకోండి. నిద్ర పోయే ముందు టీవీ, సెల్ఫోన్లకు దూరంగా ఉండండి.మీరు పడుకునే గది నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. కెఫిన్, సిగరెతే అల్కాహాల్ ఇతరత్రా వ్యసనాలకు దూరంగా ఉండాలి..నిద్ర సమస్యకు ప్రాధాన కారణం ఒత్తిడి. ఈ ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకు యోగా లాంటివి చేస్తుండాలి.అలాగే సాయంత్రం 4 గంటల తరువాత నిద్ర పోకూడదు.అలా పడుకుంటే రాత్రికి నిద్ర రాదు. పనుకునే ముందు టీ,కాఫీలు వంటి వాటిని సేవించకూడదు. రాత్రి సమయంలో ఆహారం తక్కువగా తీసుకోవాలి. మంచి నిద్ర కోసం రాత్రి సమయంలో వెలుతురు తక్కువగా ఉండే లైట్స్ వేసుకోవడం చేయండి.నిద్ర సమస్యలు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది.