Sleep: ప్రతి మనిషికి సరిపడినంత నిద్ర కచ్చితం గా ఉండాలి. ఆరు గంటల కన్నా తక్కువ నిద్రపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అదేవిధంగా 10 గంటలు మించి ఎక్కువ సమయం నిద్రించడం వల్ల అనర్థాలు వస్తాయి అంటున్నారు నిపుణులు.
చాలా మంది రాత్రిపూట నిద్ర పట్టని సమస్య ఉంటుంది. అలాంటి వారు పగటి పూట నిద్ర పోతారు. మరికొందరు రాత్రిపూట నిద్ర పోవడంతో పాటు, మధ్యాహ్న భోజనం అయిన తర్వాత నిద్ర పోతుంటారు.
బాగా అలసిపోయిన సందర్భాల్లో మధ్యాహ్న సమయంలో నిద్ర వస్తుంది.అయితే పగటి పూత నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు తెలియచేస్తున్నారు. ప్రతి రోజు పగలు నిద్ర పోతూ ఉంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలియచేస్తున్నారు .
మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉన్నవారు అధిక బరువు పెరగడంతో పాటు, షుగర్, గుండె జబ్బులు, వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీనివలన అర్ధాయుష్కులు గా మిగిలిపోతారు. రాత్రిపూట నిద్ర పట్టలేదు అని మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల మాత్రం ప్రయోజనం ఉండదు.కాబట్టి రాత్రి నిద్రకు వస్తున్నా ఆటంకాలు ఏమిటో తెలుసుకుని పరిష్కరించుకోవాలి. మధ్యాహ్నం నిద్ర పోవాలి అని అనిపిస్తే మాత్రం 20 -30 నిమిషాలు మాత్రమే నిద్రపోవడం మంచిది. ఒక్క కునుకు మాత్రమే తీయడం వల్ల కొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనం కలుగుతుంది. కానీ మధ్యాహ్నం పడుకుని గంటల తరబడి నిద్రపోవడం వల్ల కోరి సమస్యలను తెచుకున్నవారవుతారు.
మధ్యాహ్నం సమయంలో ఎక్కువ నిద్రపోయే వారిలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు దీర్ఘకాలంలో ఎక్కువగా ఉంటాయి. షుగర్ ,కొరియా, జపాన్ వంటి దేశాల్లో ఉద్యోగులు మధ్యాహ్నం ఒక అరగంట కునుకు తీస్తారు. ఇలా చేయడం వల్ల విశ్రాంతి కలిగి మరింత ఎక్కువగా పని చేస్తారు అని భావిస్తారు. 30 నిమిషాలకు మించకుండా కునుకు తీస్తే మెదడు చురుకుగా పని చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు కూడా తెలియచేస్తున్నారు .