హెల్త్

Smile: నవ్వితే ఆరోగ్యం కానీ….  నవ్వుతున్నట్టు నటిస్తే ఆరోగ్యానికి ముప్పు తప్పదు!!

Share

Smile: పబ్లిక్ సర్వీస్ లో జాబ్ చేసేవారు 24 గంటలు ముఖంపై చిరునవ్వు చెదరకుండా  మెయింటెన్ చేస్తుంటారు. వారి ఉద్యోగం లో అది ఒక   అతి ముఖ్యమైన అంశం.కస్టమర్ చెప్పింది చాలా ప్రశాంతంగా వింటూ వారి సమస్య కు  చిరునవ్వుతో సమాధానం  ఇస్తుంటారు. కస్టమర్  కోపగించుకున్న కూడా      వారు నిగ్రహం కోల్పోకుండా బాలన్స్  చేసుకుంటారు. ముఖం మీద నవ్వు మాత్రం  పోదు.    కానీ అది వారి హెల్త్ కి ఏమాత్రం  మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయడం వలన వారి    జీవన విధానం పూర్తిగా మారిపోతుంది  అని  తెలియ చేస్తున్నారు.

అలా ముఖానికి నవ్వు అంటుకున్నట్టు నవ్వే నవ్వు వల్ల ఆల్కహాల్   ఎక్కువగా తీసుకునే అవకాశం  ఉంది అని  పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఆక్యుపేషనల్ హెల్త్ సైకాలజీ అనే జర్నల్లో ఈ విషయం తెలియజేశారు. నకిలీ నవ్వు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలియచేసారు. ప్రజా సంబంధాల లో  ఉండే వ్యక్తులు  ఉండే గ్రూప్ తో  జరిపిన సంభాషణ లో  పరిశోధకులు పలు  విషయాలు గ్రహించారు. ఇలా వర్క్ కోసం  నవ్వు నవ్వే వాళ్ళు, తమ వ్యక్తిగత భావాలు    మనసులోనే దాచి పెట్టేస్తారు అని   దీని వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది అని తెలియ చేస్తున్నారు. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వాళ్లు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెడతారట.

ముఖ్యంగా రెస్టారెంట్, డీటెయిల్స్ స్టోర్ లో పని చేసే యువతకు ఈ సమస్య ఉందని  తెలియచేస్తున్నారు. కాబట్టి అలంటి జాబ్స్ లో ఉన్నవారు ఎప్పటికప్పుడు మీ మైండ్ సెట్ ని పరీక్షించుకుంటూ ఏదైనా సమస్య ఉంటే వెంటనే నిపుణుల్ని  సంప్రదించి సలహాలు సూచనలు పాటించడం మంచిది.


Share

Related posts

ఇంటిలో సాలీళ్ల సమస్య కు తేలికైన పరిష్కారం??

Kumar

Hibiscus: మీ ఇంట్లో మందారం చెట్టు ఉందా..!? బంగారం ఉన్నట్టే.. ఈ విషయాలు తెలుసుకోండి..

bharani jella

Throat Pain: గొంతు నొప్పా.. అయితే ఈ పండ్లు తినండి.. వెంటనే రిలీఫ్ పొందండి..!!

bharani jella