Hair: జుట్టుకు సంబంధించిన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ఇదే… తెలిస్తే ఆశ్చర్య పోతారు!!(పార్ట్-2)

Share

Hair: బ్రింగ్‌రాజ్‌లో విటమిన్ E, D కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటాయి. ఇవి మీకు మంచి  నిద్రను  ఇవ్వడం తో పాటు విశ్రాంతి  కలిగిస్తాయి. మీలో కోపం, ఆవేశం శాంతిప చేస్తాయి. మీ మూడ్ బాగుండేలా చేస్తుంది.కొందరికి పొడి చర్మంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది.  అలాంటి వారు  బ్రింగ్ రాజ్ తైలం ను  చర్మానికి రాసుకొని మసాజ్  చేసుకోవడం  వలన సమస్య పరిష్కారం అవుతుంది.మరి  కొంత మందికి మైగ్రేన్ తలనొప్పి వేధిస్తుంటుంది. బ్రింగ్ రాజ్ తలకు రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది  దీనికి  గల కారణం అందులో ఉండే మెగ్నీషియం.

 Hair:
Hair:

కొంత మందికి తీరిక లేని జీవన విధానం  వల్ల చాలా విషయాలు మర్చిపోతుంటారు. అలాంటి వారు ఈ తైలం వాడితే జ్ఞాపక శక్తి  పెరుగుతుంది అని  పరిశోధనలో తేలింది. తలపైన అక్కడక్కడ  వెంట్రుకలు మొత్తం  రాలిపోయి ఖాళీగా కనిపిస్తుంది  దానిని పేనుకొరుకుడు అంటారు. గుంటగలగర  మొక్కను( బ్రింగ్ రాజ్) వేరుతో సహా సేకరించి శుభ్రం  చేసి మెత్తటి ముద్ద అయ్యేట్లు నూరుకుని  పేనుకొరుకుడు గల ప్రదేశాల్లో పూతగా పెట్టుకోవాలి . ఈ విధంగా ఒక వారం రోజులు పాటు చేస్తే వెంట్రుకలు రాలడం ఆగి పోయి కొత్త వెంట్రుకలు కూడా  వస్తాయి.బ్రింగ్ రాజ్  మొక్కను వేరుతో పాటు తెచ్చుకుని మెత్తగా దంచి ముద్ద గా చేసుకుని దానికి నాలుగు రెట్లు నువ్వుల నూనె లేక కొబ్బరి నూనె కలిపి సన్నని సెగపై మరగనివ్వాలి .

 Hair:
Hair:

ఆ మిశ్రమంలో తేమ తగ్గిపోయాక  నూనెను వడపోసుకుని  ఈ  నూనెను వరుసగా కొన్ని  రోజుల పాటు తలకు వాడితే చిన్న వయస్సులో తెల్లబడిన  జుట్టు నల్లబడటం తో  పాటు వెంట్రుకలు రాలిపోవడం తగ్గి  కళ్లకు శక్తి  కలుగుతుంది.
బ్రింగ్ రాజ్ తైలం అన్ని షాపుల్లో దొరకడం అనేది కష్టం . మెడికల్ షాప్ లో, ఆయుర్వేద షాపులు లేదా ఈ-కామర్స్ సైట్లలో కొనుగోలు చేయవచ్చు . ధర కాస్త ఎక్కువ ఉన్న . ఫలితాలు కూడా అందుకు తగ్గట్టే పొందవచ్చని  ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు.


Share

Related posts

.ఇదెక్కడి గొడవరా బాబు .. మినరల్ వాటర్ తాగినా కొత్తకష్టాలు !

Kumar

Eatela Rajendar: స్పీక‌ర్ ఫార్మాట్లో ఈట‌ల రాజీనామా చేయ‌నిది ఇందుకేనా?

sridhar

Irregular Periods: నెలసరి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇవి తినండి!!

Kumar