బీ కాంప్లెక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం ..
బీ విటమిన్స్ ఎనిమిది రకాలు – B1, B2, B3, B5, B6,B7, B9, B12. వీటన్నింటినీ కలిపి బీ కాంప్లెక్స్ అంటారు. చాలా వరకూ ఈ విటమిన్స్ అన్నీ కలిసే లభిస్తాయి. శరీరానికి కావలసినంత బీ కాంప్లెక్స్ లభించకపోతే ఏమవుతుందో… అది లభించే ఆహారం ఏమిటో ఒక్క సారి చూద్దాం.
B1 విటమిన్ సరిపోయినంత లేకపోతె బరువు కోల్పోడం,ఆకలి లేకపోవడం జ్ఞాపక శక్తి తగ్గడం ,హార్ట్ ప్రాబ్లంస్ ,కాళ్ళూ చేతులూ తిమ్మిర్లుగా అనిపించడం జరుగుతుంది . విటమిన్ B1 లభించే పదార్ధాలు.. హోల్ గ్రెయిన్స్,రైస్ ,సోయా బీన్స్, బ్లాక్ బీన్స్ గింజలు,నట్స్,కమలాపండు,బఠానీలు పప్పు ధాన్యాలు.
B2 విటమిన్ సరిపోయినంత లేకపోతే ఇలా తెలుస్తుంది.నోటి పుండు,పెదవుల వాపు, పగుళ్లు,జుట్టు ఊడడం,కళ్ళు ఎర్రబడడం,నోరు, గొంతు వాచినట్లు ఉండడం స్కిన్ డిసార్డర్స్. ఈ విటమిన్ లోపం మరీ ఎక్కువగా ఉంటే ఎనీమియాకీ కాటరాక్ట్ కీ దారి తీయవచ్చు. ప్రెగ్నెన్సీ సమయం లో ఈ విటమిన్ సరిపోయినంత లేకపోతే పుట్టే పిల్లలు కొన్ని అవకరాలతో పుట్టే రిస్క్ ఉంది. B2 లభించే పదార్ధాలు ఓట్స్, పెరుగు, మజ్జిగ, మష్రూంస్, బాదం పప్పు,ఆకు కూరలు, పాలు, అవకాడో.
B3 విటమిన్ లోపిస్తే ఇలా తెలుస్తుంది. ఎర్రగా మారిన నాలుక ,వాంతులు, డయేరియా, కాన్స్టిపేషన్, తలనొప్పి, నీరసం, డిప్రెషన్ B3 లభించే పదార్ధాలు పప్పు ధాన్యాలు,హోల్ గ్రెయిన్స్ ,నట్స్ గ్రీన్ పీస్,అవకాడో,మష్రూంస్,బ్రౌన్ రైస్ వేరు శనగలు అయితే, వీటిలో ఉన్న నియాసిన్ ని బాడీ తేలికగా అబ్జార్బ్ చేసుకోలేదు. బ్రేక్ ఫాస్ట్ సీరియల్స్ లో కలిపిన నియాసిన్ ని బాడీ తేలికగా గ్రహిస్తుంది.
B5 లోపిస్తే ఇలా తెలుస్తుంది. కాళ్ళూ, చేతులూ మంటలూ, తిమ్మిరి,తలనొప్పి,చిరాకు,నిద్రలేమి, ఆకలి లేకపోవడం. B5 లభించే పదార్ధాలు సన్ ఫ్లవర్ సీడ్స్,అవకాడో,బ్రేక్ ఫాస్ట్ సీరియల్ బంగాళా దుంప,బ్రకోలి,ఓట్స్,శనగలు వేరు శనగలు.
B6 లోపిస్తే ఇలా తెలుస్తుంది. ఎనీమియా, పెదవులు పగలడం,నాలుక వాపు,ఇమ్యూన్ సిస్టం బలహీన పడడం,కంఫ్యూజన్,డిప్రెషన్ ,B6 లభించే పదార్ధాలు శనగలు ,బంగాళా దుంప,బ్రేక్ ఫాస్ట్ సీరియల్ పాలకూర,సోయా బీన్స్,ఎర్ర కందిపప్పు,పెసరపప్పు,అల్లం, వెల్లుల్లి,బ్రౌన్ రైస్
B7 లోపిస్తే ఇలా తెలుస్తుంది. జుట్టు పల్చబడడం,
గోళ్ళు పెళుసుగా తయారవడం నీరసం, నిస్త్రాణ డిప్రెషన్. B7 లభించే ఆహారపదార్ధాలు సన్ ఫ్లవర్ సీడ్స్, అరటి పండు, అవకాడో కాలీఫ్లవర్,మష్రూంస్,పాలు,వేరు శనగలు.
B9 లోపిస్తే ఇలా తెలుస్తుంది. తలనొప్పి,నీరసం, నిస్త్రాణ,చిరాకు నోటి పుండు, స్కిన్, హెయిర్, నెయిల్స్ ఛేంజ్ అవ్వడం B9 లభించే పదార్ధాలు ఆకుకూరలు,అవకాడో,బొప్పాయి,ఆరెంజ్ జ్యూస్,బీన్స్,నట్స్,సోయా బీన్స్,రాజ్మా కాప్సికం,బీట్రూట్ .
B12 ఈ విటమిన్ లోపిస్తే ఇలా తెలుస్తుంది. కాన్స్టిపేషన్ ఆకలి లేకపోవడం,కాళ్ళూ, చేతులూ తిమ్మిర్లు,జ్ఞాపక శక్తి తగ్గిపోవడం,డిప్రెషన్,నీరసం. B12 లభించే పదార్ధాలు పాలు, మజ్జిగ, పెరుగు,పన్నీర్,ఛీజ్, బటర్ న్యూట్రిషనల్ యీస్ట్,బ్రేక్ ఫాస్ట్ సీరియల్ ఫోర్టిఫైడ్ ఆల్మండ్ మిల్క్
మాంసాహారమే కాదు, శాకాహారం ద్వారా కూడా ఈ విటమిన్స్ లభిస్తాయని తెలిసింది కాబట్టి, ఈ ఫుడ్స్ ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.