Boda Kakarakaya | Spincy Gourd | Agakarakaya: మారుతున్న కాలానుగుణంగా శరీర అలవాట్లు, విధానం, ఆహార తిండి మారుతూ వస్తోంది. ఈ టెక్నాలజీ యుగంలో జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్స్‌తో శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు, ప్రోటీన్లు పూర్తి స్థాయిలో అందడం లేదు. మనిషి ఆహారపు అలవాట్లు చాలా మారాయి. దానికి తోడు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఈ వైరస్‌లను తట్టుకునే శక్తి శరీరానికి లేదు. మనం తీసుకునే ఆహారం శరీరంలో ఇమ్యూనిటీని పెంచడం లేదు. అయితే ఈ రోజు మనం బోడ కాకర కాయ గురించి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. బోడ కాకర కాయల వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అన్ని వయసుల వారు మంచి పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి అవసరమైన అన్ని విటమిన్‌లను అందించే ఏకైక కూరగాయ ‘బోడ కాకర కాయ’. చాలా మందికి బొంత కాకర, లేదా బోడ కాకరగా మీకు తెలిసి ఉంటుంది. దీనిని అడవి కాకర, ఆగాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు.

బోడ కాకరకాయలో ఉండే పోషకాలు..
బోడ కాకరకాయలో అన్ని రకాలు విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లు బీ1, బీ2, బీ3, బీ5, బీ6, బీ12, విటమిన్లు ఏ, సీ, డీ, డీ3, జింక్, కాపర్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, సోడియం, విటమిన్లు హెచ్, కే ఇలా అన్ని రకాలు పోషకాలు, విటమిన్లు ఉంటాయి. బోడ కాకరను ‘పోషకాల గని’ అని కూడా అంటారు. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన అన్ని పోషకాలు బోడ కాకరలో దొరుకుతాయి.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..
బోడ కాకరలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడినప్పుడు శరీరాన్ని కాపాడుతుంది. డయాబెటిక్ వ్యాధితో బాధపడేవారికి బోడ కాకర దివ్వౌషధం అని చెప్పవచ్చు. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

పలు వ్యాధులు నయం..
తలనొప్పి, దగ్గు, జలుబు, చెవినొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను బోడ కాకర తగ్గిస్తుంది. చాలా మందికి జట్టు రాలుతూ ఉంటుంది. అలాంటి సమస్య ఉన్న వారు.. బోడ కాకరను తింటే మీ జట్టు రాలే సమస్య కూడా కొంత వరకు పరిష్కారమవుతుంది. అలాగే వర్షాకాలంలో వచ్చే దురదల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. పక్షవాతం, శరీర వాపు, కంటి సమస్యలపై మంచి ప్రభావం చూపిస్తుంది. రక్త సరఫరా సక్రమం చేస్తుంది. క్యాన్సర్, రక్తపోటు వంటి వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది. వయసు పెరిగే కొద్ది శరీరంపై ముడతలు వస్తుంటాయి. బోడ కాకరలో ఉంటే ప్లవనాయిడ్స్ ముడతలను నియంత్రిస్తుంది.

గర్బిణులకు ఉపయోగకరంగా..
గర్భిణులకు బోడ కాకర ఎంతో ఉపయోగపడుతుంది. గర్భిణులు తరచూ బోడ కాకర తినడం వల్ల ఆమెతో పాటు గర్భంలో ఉన్న శిశువుకు కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది. శిశువు ఎదుగుదలకు, మేధాశక్తికి తోడ్పడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గర్భిణులు చాలా వరకు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బోడ కాకరకు సీజనల్ వ్యాధులను దగ్గరికి రానివ్వకుండా చేసే గుణం ఉంటుంది. అందుకే గర్భిణులు తప్పనిసరిగా బోడ కాకర కాయలను ఆహారంలో తీసుకోవాలి.

చికెన్, మటన్ కంటే..
చికెన్, మటన్‌లో దొరికే ప్రోటీన్ల కంటే ఎక్కువగా బోడ కాకరతో ఉంటాయి. శాఖాహారులకు బోడ కాకర బెస్ట్ ఆప్షన్. శరీరానికి కావాల్సిన అన్ని ప్రోటీన్లు మీరు బోడ కాకర నుంచి పొందవచ్చు. శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. ఇందులో ఉండే ఫైటో న్యూట్రిషన్ వల్ల శరీరాన్ని అలసట రానివ్వకుండా చేస్తుంది. రోజంతా యాక్టివ్‌గా పని చేస్తారు. మలబద్ధకం, అజీర్తి సమస్యలు కూడా దరిచేరవు. అధికంగా చికెన్, మటన్ తినడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తె అవకాశం ఉంటుంది. కానీ బోడ కాకరతో ఆ సమస్యలేం ఉండవు.