40 ఏళ్ల వయస్సులో చురుకుగా ఉండాలంటే అది తప్పకుండ చేయవలిసిందే అంటున్న ఆరోగ్య నిపుణులు!!

ఆధునిక కాలం లో అనేక కారణాలతో వివాహం ఆలస్యమవుతుంది. దీని వలన  పిల్లలు ఆలస్యంగా పుడుతున్నారు. వారి బాధ్యతలు నెరవేర్చడం కోసం రాత్రనక, పగలనక కష్టపడవలిసి వస్తుంది. దీని ఫలితం గా ఒత్తిడి రెట్టింపు అవుతుంది. తమ కోసం తాము సమయాన్ని కేటాయించుకోకుండా టార్గెట్లు , మీటింగులు, అంటూ రోజంతా ఒత్తిడితో గడిపితే ఆరోగ్యానికి ప్రమాదమని  పరిశోధనలు తెలియచేస్తున్నాయి. 40 ఏళ్లు దాటిన తరవాత కూడా ఉద్యోగం లోఉరుకుల, పరుగులు తప్పడం లేదా.. కొన్ని సందర్భాల్లో తప్పకపోయినా వారానికి 25 గంటల కంటే మించి పని చేస్తే మెదడు పని తీరు‌పై ఒత్తిడి పడకతప్పదని  ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

40 ఏళ్ల వయస్సులో చురుకుగా ఉండాలంటే అది తప్పకుండ చేయవలిసిందే అంటున్న ఆరోగ్య నిపుణులు!!

మధ్య వయస్సులో వ్యాయామం చేసేవాళ్లకు వృద్ధాప్యంలో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాల తక్కువ అనే చెప్పాలి. ఒకవేళ గుండె సంబంధిత సమస్యలు వచ్చినా త్వరగా కోలుకుంటారు.మధ్య వయస్సులో ఫిట్‌నెస్‌తో ఉన్న వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం 56 శాతం తక్కువ గా ఉంది. స్థూలకాయం,మధుమేహం, కిడ్నీ సమస్యల్లాంటి దీర్ఘకాల వ్యాధుల కు డిప్రెషన్‌తో సంబంధంఉంది. అయితే ఇలాంటి రోగులు క్రమంగా  వ్యాయామం చేయడం వలన ఈ రోగాలు తగ్గుతాయని పరిశోధకులు తేల్చారు.

వ్యాయామం చేయడం వలన డిప్రెషన్‌ మరియు డిప్రెషన్ కి సంబందించిన  వ్యాధులు కూడా తగ్గుతాయి అని అనేక పరిశోధనల లో బయట పడింది. వ్యాయామం చేస్తూ ఫిట్‌నెస్  గా ఉంటే డిప్రెషన్‌ను నినిరోధించవచ్చు. తద్వారా భవిషత్తులో రాబోయే గుండె  సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్చ్ పరిశోధకులు 40 ఏళ్లు పైబడిన 6,000 మందికి పైగా ఉద్యోగులపై ఒక అధ్యయనం నిర్వహించారు. 40 ఏళ్ల వయసు లో మెదడు పని తీరు తగ్గిపోవడం మొదలైనప్పటికీ ,వ్యాయామం చేసే అలవాటు ఉంటే మాత్రం వారి యొక్క మెదడు పని తీరు చాల చురుకుగా ఉందని తేలింది.

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.