Stomach Pain: తరచు కడుపునొప్పి వస్తుందా..ఈ చిట్కాను పాటించండి..

Share

Stomach Pain: ప్రస్తుతం మనం ఆహార నియమాలు పాటించకపోవడం లేదు. చాలా మంది తమ ఇష్టానుసారంగా వివిధ రకాల తినుబండారాలను తీసుకుంటుంటారు. దీనికి తోడు కల్తీలు. ప్రస్తుతం మార్కెట్ అన్ని వస్తువుల్లో కల్తీలు రాజ్యం ఏలుతున్నాయి. వంట నూనె మొదలు కొని అన్ని కల్తీలు వచ్చేస్తున్నాయి. దీంతో బయట హోటల్స్ ఎక్కువగా తినే వారు తరచు కడుపునొప్పితో బాధపడుతుంటారు. కడుపు నొప్పి వల్ల తలనొప్పి రావడం, బాడీ పెయిన్స్ ఇలా అనేక సమస్యలు రావచ్చు. చలికాలం కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సీజన్ లలో హటాత్తగా కడుపులో నొప్పి వచ్చినా తగ్గించుకోవడానికి మందులనే వాడకుండా గృహ వైద్యంతోనే తగ్గించుకోవచ్చు.

Stomach Pain health tips
Stomach Pain health tips

Read More: Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా వ్యాఖ్యలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

Stomach Pain: వాముతో అజీర్ణ నొప్పి తగ్గుతుంది

వాము తీసుకోవడం వల్ల కడుపునొప్పి తగ్గుతుంది. వాములో ఉండే థైమోల్ గ్యాస్ ఎర్పడకుండా అడ్డుకుంటుంది. పూర్వకాలం నుండి మన పెద్దలు కడుపునొప్పి వంటి సమస్యల వస్తే వామును ఔషదంగా ఇచ్చేవాళ్లు. వాము జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణ సమస్యలు, అసిడిటీ సమస్యలను దూరం చేస్తుంది. అంతే కాకుండా పావు స్పూన్ సైంధవ లవణంతో పావు స్పూన్ వాము దంచి ఆ పొడిని దవడలో పెట్టి నములుతూ రసాన్ని తీసుకోవడం వల్ల కడుపులో చేరిన గ్యాస్ తేన్పు రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ఇది రుచిలో కొంచెం ఎగరు, ఘాటుగా ఉంటుంది. అయినప్పటికీ ఉమ్మ వేయకుండా నములుతూ మింగాలి. తరువాత అరగ్లాసు గోరు వెచ్చటి నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ సక్రమంగా పని కడుపు నొప్పి తగ్గిపోతుంది.


Share

Related posts

Shruti Haasan: మోస్ట్ డిజరబుల్ ఉమెన్ 2020.. శృతి హాసన్..! సమంత సెకండ్..

Muraliak

Canada: ప్రముఖ స్కూల్స్ లో అస్థిపంజరాల గుట్టలు..!!

bharani jella

AP CM YS Jagan: మానవతా దృక్పదంతో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

somaraju sharma