Back Pain: సాధారణంగా ఆధునిక ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వలన విపరీతమైన తలనొప్పి, వెన్నునొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు.. అయితే ఈ వెన్ను నొప్పి ఎక్కువగా ఉండటం వలన సరిగా తినలేం.. సరిగా కూర్చోలేం.. ప్రశాంతంగా నిద్ర కూడా పోలేం.. అయితే ఈ వెన్నునొప్పి నుంచి బయటపడేసే చిట్కాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.. వ్యాయామాలు, యోగ భంగిమలు ట్రై చేయడం ద్వారా కూడా వెన్ను నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చని.. కొన్ని నివారణ చిట్కాలను ఈరోజు మనం తెలుసుకుందాం?
మనం ప్రతిరోజు వేసుకునే చెప్పులు చూసి కూడా సౌకర్యవంతంగా లేకపోవడం వలన వెన్ను నొప్పికి కారణం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.. అందుకే సౌకర్యవంతమైన చెప్పులను వేసుకోవాలని సూచిస్తున్నారు.
స్ట్రెచింగ్:
వెన్ను నొప్పి నుంచి బయటపడడానికి ఒక రిలాక్స్ అని చెప్పవచ్చు స్ట్రెచింగ్ ద్వారా కండరాలపై ఒత్తిడి తగ్గుతుందని.. అది కండరాల నొప్పిని చాలా వరకు తగ్గిస్తుందని.. నేలవైపు వంగి కాలివేలను తాకటం.. రకరకాల యోగ భంగిమలను స్ట్రెచింగ్ చేస్తే.. వెన్ను నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చని యోగా నిపుణులు తెలియజేస్తున్నారు..
మసాజ్:
శరీరం ఎంతో అలసిపోయినప్పుడు బాగా నొప్పులుగా ఉంటాయి.. అప్పుడు మనకు మసాజ్ చేయించుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది.. అయితే బాగా వెన్నునొప్పి ఉన్నప్పుడు కూడా తక్షణమే ఉపశమనం పొందడం కోసం ఆలివ్ ఆయిల్ తో కానీ కొబ్బరి నూనెతో గాని మసాజ్ చేయించుకుంటే వెంటనే ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. ఈ మసాజ్ తో పాటు నూనెను గోరువెచ్చగా చేసి దానిలో కొంచెం కర్పూరం వేసుకొని చేస్తే ఇంకా బాగా రిజల్ట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.