Super Glue : సాధారణంగా మనకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మన చర్మం గాయాలపాలు అవుతుంది. కొన్నిసార్లు ఎక్కువ ప్రమాదం చోటు చేసుకుంటే మనకు తగిలిన గాయాలు మానడానికి కొంత సమయం తీసుకుంటుంది. అదే విధంగా చర్మం ఎక్కువగా చీలినట్లయితే డాక్టర్లు కుట్లు వేసి సరి చేస్తారు. అయితే ఇప్పటి నుంచి మన చర్మంపై ఏదైనా గాయమైనప్పుడు చర్మానికి కుట్లు వేయించుకుని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన చర్మం పై ఏర్పడిన గాయాలు పుండ్లు తొందరగా మానడానికి శాస్త్రవేత్తలు ఓ చక్కటి పరిష్కారాన్ని ఆవిర్భవించారు. అయితే అదేమిటో ఇక్కడ తెలుసుకుందాం..
అమెరికాకు చెందిన బయో మెడికల్ ఇంజినీర్లతోపాటు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన పరిశోధకులు ఓ సర్జికల్ గ్లూను అభివృద్ధి చేశారు. ఈ సర్జికల్ గ్లూను మెట్రోగా పేరు పెట్టారు. మన శరీరం పై ఏదైనా గాయాలు లేదా పుండ్లు తగిలినప్పుడు వాటిపై ఈ సర్జికల్ గ్లూ ను వాడటం వల్ల కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ గాయం తొందరగా మానడానికి దోహదపడుతుంది. దీంతో గాయమైన మన చర్మం తొందరగా సాధారణ స్థితికి చేరుకుంటుంది.
సర్జికల్ గ్లూ ఎప్పుడు పనిచేస్తుందంటే:
మనకు గాయం అయినప్పుడు వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రంచేసి గాయమైన ప్రదేశంపై ఈ సర్జికల్ గ్లూ అంటించాలి. ఆ విధంగా గ్లూ అప్లై చేశాక అల్ట్రావైలెట్ కిరణాల సహాయంతో దీనిని యాక్టివేట్ చేసినప్పుడు మాత్రమే ఈ గ్లూ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇప్పటికే ఈ సర్జికల్ గ్లూ ను ఎలుకలపై, పందుల పై ప్రయోగించగా
మంచి ఫలితాలను పొందాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు. తొందరలోనే దీనిని మనుషులపై ట్రైల్ చేసిన తర్వాత మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నారు. ఈ గ్లూ కి సంబంధించిన ఓ వీడియోను తాజాగా కిరణ్ మజుందార్ షా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.