Kalonji Milk: పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. ప్రతిరోజు రెండు గ్లాసుల పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.. పాలలో కలోంజి విత్తనాల పొడిని కలిపి తీసుకుంటే బోలెడు లాభాలు ఉన్నాయి..! ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!
కలోంజి విత్తనాలు నల్ల రంగులో ఉంటాయి. ఈ విత్తనాలలో క్యాల్షియం, ఐరన్, కాపర్, ఫోలిక్, ఆసిడ్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ విత్తనాలను కొద్దిగా పెనం మీద వేడి చేసుకొని మిక్సీ పట్టి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు ఒక గ్లాసు పాలలో కలుపుకుని తాగాలి. ఇలా తాగితే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ప్రతి రోజూ తాగితే ఈ పాలు బరువు తగ్గుతారు. ఈ పాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. మలబద్ధకం ను నివారిస్తాయి. గర్భిణీ స్త్రీలు పాలు తాగడం చాలా మంచిది. గర్భిణీ మహిళలు ఈ పాలు తాగడం వలన రక్తం వృద్ధి చెందుతుంది. పుట్టబోయే బిడ్డలో ఎముకలు బలంగా తయారవుతాయి.
మధుమేహంతో బాధపడుతున్న వారు ఈ పాలు తాగితే డయాబెటిస్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. వరుసగా మూడు రోజులు ఈ పాలను తాగితే కడుపులో నులి పురుగులు పోతాయి. కలోంజి పాలు మగవాళ్ళు తాగితే బోలెడు లాభాలు ఉన్నాయి. వీర్య వృద్ధిని పెంచుతాయి. పురుషుల బలహీనతలను తగ్గిస్తుంది. సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.