ట్రెండింగ్ హెల్త్

Sorghum: జొన్న రొట్టెలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Share

Sorghum: చాలా మంది బరువు తగ్గడానికి అహారంలో మార్పులు చేసుకుంటుంటారు. అవి ఎక్కువగా ఏ ఆహారం తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.  ప్రధానంగా జొన్న రొట్టెలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. మన భారతదేశంలో జొన్నలను ఒక్కో చోట ఒక్కోలా పిలుస్తుంటారు. కొన్ని చోట్ల జోవార్ అని, ఇంకొన్ని చోట్ల సొర్లుమ్ అని పిలుస్తుంటారు. ఇంకొందరు అయితే జొన్నలను కొత్త రకంగా క్వినోవా అని పిలుస్తుంటారు. గతంలో జొన్న రొట్టెలు కొన్ని ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే తినేవారు. అయితే ఇటీవల కాలంలో జొన్న రొట్టెల వాడకం బాగా పెరిగింది. ఇంతకు ముందు చపాతీ మాత్రమే తినేవాళ్లలో చాలా మంది ఇప్పుడు జొన్న రొట్టెలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. జొన్నరొట్టెలు చాలా బలవర్ధకమైన అహారం. ఎముక పుష్టి కూడా ఉంటుంది. జొన్న రొట్టెలు, జొన్న పిండితో చేసిన ఇతర వంటకాలు సులభంగా అరగుతాయి. దాని వల్ల బరువు పెరగకుండా ఉంటాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.

surprising health benefits of Sorghum
surprising health benefits of Sorghum

Sorghum: జొన్న రొట్టలతో ప్రయోజనాలు ఏమిటంటే..

  • ఇందులో గ్లూటెన్ ఉండదు.
  • ఫైబర్ అధికంగా ఉంటుంది.
  • రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది
  • ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది.
  • ఐరన్, మెగ్నిషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ బి 3 ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి.
  • బరువు తగ్గడానికి చలా ఉపయోగపడుతుంది.
  • జీవ క్రియను పెంచి మలబద్దకాన్ని దూరం చేస్తుంది
  • గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది
  • శక్తిని అందిస్తుంది
  • రక్త ప్రసరణ పనితీరు మెరుగుపరుస్తుంది

వాస్తవానికి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా అవసరానికి మించి చెడు కొలెస్ట్రాల్ పెరిగితే వెంటనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే జొన్న రొట్టెలు తినడం వల్ల వాటిలో ఉండే ఫైబర్ అదనంగా పెరిగిన చెడు కొలిస్ట్రాల్ ను నిరోధిస్తుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. దాంతో గుండె కు సంబంధిత జబ్బులు రాకుండా ఉంటాయి. ఇక జొన్న రొట్టెలను రోజుకు రెండు చొప్పున ప్రతి రోజు తీసుకున్నా ఎలాంటి సమస్య ఉండదు. ఇవి త్వరగా అరగడంతో పాటు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. అంతే కాకుండా అధిక బరువును అదుపులోకి తెస్తాయి.

గమనిక: ఆరోగ్య నిపుణుల, అధ్యాయనాలు తెలుపుతున్న సమాచారం ప్రకారం ఈ వివరాలు అందిస్తున్నాం. ఈ కథనం కేవలం ప్రజల అవగాహన కొరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్యలు ఉన్నా వైద్యులను కన్సల్ట్ కావడం ఉత్తమం అని గమనించగలరు.


Share

Related posts

బిగ్ బాస్ 4: అవినాష్ కోసం బరిలోకి జబర్దస్త్ టీం..!!

sekhar

Nellore Road Accident : నెల్లూరు లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

bharani jella

Naga Chaitanya: ఈ ఏడాదిలో రిలీజ్ కానున్న 3 సినిమాలతో చైతు హ్యాట్రిక్ అందుకుంటాడా..!?

bharani jella