స్వీట్ కార్న్ పకోడీ ఇలా చేసుకుని తింటే ఆ కిక్కే వేరు..!

Share

ఈ కాలంలో ఎక్కడ చూసినా మొక్కజొన్న కంకులు విరివిగా దొరుకుతాయి.. స్వీట్ కార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. చాలామంది వీటిని ఉడకపెట్టుకుని లేదా కాల్చుకొని తింటారు. మరి కొంతమంది మొక్కజొన్నలతో గారాలను తయారు చేసుకొని తింటారు. కానీ ఎప్పుడూ ఒకే రకంగా మొక్కజొన్నలు తిని బోర్ కొట్టిందా.!? అయితే ఈసారి కాస్త డిఫరెంట్ గా మొక్కజొన్న పకోడీలను తయారు చేసుకునే తినండి.. రుచికి రుచి ఆరోగ్యాన్నికి ఆరోగ్యం.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

స్వీట్ కార్న్ పకోడీ తయారీకి కావలసిన పదార్థాలు..

మొక్కజొన్న గింజలు ఒక కప్పు, శెనగపిండి అర కప్పు, బియ్యం పిండి రెండు చెంచాలు, సన్నగా తరిగిన అల్లం ఒక చెంచా, జీలకర్ర ఒక చెంచా, పచ్చిమిరపకాయలు రెండు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె వేయించడానికి సరిపడా..

ముందుగా మిక్సీలో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, మొక్కజొన్న విత్తనాలు వేసి కచ్చాపచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వేసి అందులో సెనగపిండి, బియ్యప్పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి..

 

ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో నూనె పోసి బాగా వేడెక్కనివ్వాలి . నూనె వేడెక్కిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మొక్కజొన్న పకోడీల పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పకోడీలు లాగా చేసుకోవాలి. ఇవి బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. టమాటా కెచప్ తో కానీ పల్లీ చట్నీతో కానీ ఈ పకోడీని తింటే చాలా రుచికరంగా ఉంటాయి.. ఈ సీజన్లో దొరికే మొక్కజొన్నలు తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది..


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

48 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

2 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

4 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago