గుండెపోటు కు గురయ్యే వారిలో చెయ్యి లాగేయడం, ఊపిరి అందకపోవడం, చమట పట్టడం, వికారంగా ఉండ డం వంటి లక్షణాలు స్త్రీపురుషులిద్దరిలోనూ కనపడతాయని తెలిసింది. పైగా, మహిళల్లో సాధారణంగా అందరిలో కనపడే గుండెపోటు లక్షణాలతోపాటు, గొంతు, దవడ, మెడలో నూ అసౌకర్యం క లుగుతుందని తేలింది.
తమకు గుండెపోటు వచ్చే అవకాశం తక్కువని భావించడం వలన మహిళలు ఆ జబ్బు కు చికిత్స ఆలస్యం గా మొదలెడతారని, దాంతో ప్రమాదం మరింత పెరుగుతుంది.
గుండె పోటుకు ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి:
గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడతారు. ఈ లక్షణం కనిపిస్తే తప్పకుండా అప్రమత్తం కావాలి.
మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురికావడం, చెప్పాలనుకొనే విషయాన్ని చెప్పలేకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పడం వంటి సూచనలను కూడా గుండెపోటుకు సంకేతాలుగా భావించాలి.రక్త సరఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటే వైద్యుడిని సంప్రదించాలి.
తరచుగా జలుబు , జ్వరం, దగ్గు వస్తున్నా, అవి ఎంతకీ తగ్గకపోయినా అనుమానించాలి. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలే.
గుండె భారంగా.. అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
మీరు మత్తు లేదా మగతగా ఉన్నా, చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండె నొప్పికి సూచనగా అనుమానించాలి.
తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు వస్తున్నా అశ్రద్ధ చేయకూడదు.
వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండెనొప్పికి దారితీస్తాయి. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.
కంటి చివరిలో కురుపులు ఏర్పడినా నిర్లక్ష్యం వద్దు. అవి గుండె పోటుకు దారితీయొచ్చు.
కాళ్లు, పాదాలు, మ డమలు ఉబ్బుతున్నట్లయితే గుండె పోటుగా అనుమానించాలి.
శరీరం పై భాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే తప్పకుండా గుండె నొప్పిరాబోతుందని గుర్తించాలి.
కొందరికి దవడలు, గొంతు నొప్పులు కూడా గుండె నొప్పికి సంకేతాలు.
గుండె సమస్యలుంటే.. తప్పకుండా హార్ట్ బీట్ను చెక్ చేసుకోవాలి. అసాధారణంగా గుండె కొట్టుకున్నట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.