NewsOrbit
హెల్త్

మామూలు పిల్లల్ని కనడం .. కవల పిల్లల్ని కనడం రెండిటికీ ఇదే తేడా !

మామూలు పిల్లల్ని కనడం .. కవల పిల్లల్ని కనడం రెండిటికీ ఇదే తేడా !

కవల పిల్లలకు జన్మనివ్వటం అనేది చాలా శ్రమతో కూడుకున్న విషయం. ఆ టైమ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గర్భధారణ సమయంలో మహిళలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. గర్భంలో ట్విన్స్ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి… అవేంటో ఇప్పుడు చూద్దాం..

మామూలు పిల్లల్ని కనడం .. కవల పిల్లల్ని కనడం రెండిటికీ ఇదే తేడా !
సాధారణంగా గర్భం దాల్చినప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే గర్భంలో కవలలు ఉన్నారంటే మరింత జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. గర్భంలో కవలలు ఉన్నప్పుడు మీ పోషక అవసరాలు భిన్నంగా ఉంటాయి. అందుకే, మీరు ఆరోగ్యంగా తింటున్నారా, తగినంతగా నీరు తీసుకుంటున్నారా అనే విషయాలు గమనిస్తూ ఉండాలి. అలాగే, మీ శరీరం చెప్పింది వినండి, తిమ్మిరి, డిశ్చార్జ్ వంటి లక్షణాలను విస్మరించవద్దు, ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉంటే సురక్షితంగా ఉండటానికి మీ వైద్యుడిని సంప్రదించండి. స్త్రీ గర్భం  లో ఒకసారి ఒక బిడ్డ ఉండేందుకే అవకాశం ఉంటుంది. మరియు గర్భంలో ఒకరు కాకుండా ఇద్దరు ఉన్నప్పుడు ఏమి చేయాలో.. రచయిత, ట్వినివర్సిటీ వ్యవస్థాపకుడు నటాలీ డియాజ్ ఇలా చెబుతున్నారు.
కవలలు ఉన్నప్పుడు మీ గర్భాశయం రెట్టింపుగా ఉంటుంది. మీ పొట్ట రెండు రెట్లు త్వరగా పెరుగుతుంది, కాబట్టి ఆ సమయంలో వెన్నునొప్పి ఉంటుంది. 25 వారాల రాకముందే అసౌకర్యంగా అనిపించవచ్చు. మరియు చాలా అదనపు బరువు, ముఖ్యంగా మీ గర్భాశయ, పొత్తికడుపు దగ్గర నొప్పిగా అనిపించవచ్చు. అందుకే ఆ సమయంలో పని, ఒత్తిడిని తగ్గించుకోవాలి. వీలైతే పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోండి. పీడియాట్రిక్స్ జర్నల్లో జరిపిన ఒక రీసెర్చ్‌లో గర్భంలో ఒకరు ఉన్నప్పుడు కంటే ట్విన్స్ ఉన్నప్పుడు మితమైన, తీవ్రమైన ప్రసవానంతర నిస్పృహ లక్షణాలు 43 శాతం ఎక్కువగా ఉంటాయని తేలింది.  అందుకే ఈ సమయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సాయం తీసుకోండి. దీని కోసం బేబీ సీటర్, మదర్ హెల్పర్ ని నియమించండి.కవలలు పుట్టడానికి 37 వారాలు పడుతుంది. కానీ అంతకన్నా ముందే ప్రసవం కావచ్చు కాబట్టి సిద్ధంగా ఉండండి. మీ గర్భంలో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత త్వరగా ప్రసవిస్తారని నిపుణులు చెబుతున్నారు.34 వారాల తర్వాత జన్మించిన చాలా మంది పిల్లలు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసియు) లో ఉంచాల్సిన అవసరం లేనప్పటికీ, మీరు ఏ ఆస్పత్రిలో ప్రసవిస్తారో అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయో లేదో ముందే చూడండి.
మీ పిల్లలు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంటే, లేదా వైద్య సమస్యలతో ఉంటె చెడుగా ఊహించద్దు. మీరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు, లాక్టేషన్ కన్సల్టెంట్ ను సంప్రదించండి. మీ పాలుసరఫరా సమానంగా ఉండటానికి ట్విన్ ఫీడింగ్ దిండు కొనండి. ప్రతి సారి మీ పిల్లలు మరియు రొమ్ములను ప్రత్యామ్నాయంగా మార్చండి.మీ పిల్లలకు ఒకేసారి పాలు ఇవ్వటం, ఒకేసారి నిద్రపుచ్చడం వల్ల మీ పని మరింత సులువు అవుతుంది. అందుకే వారికీ ఒక సమయాన్ని అలవాటు చేయండి. ఒకవేళ ఒకరు మాత్రమే పాలు తాగటానికి లేస్తే మరొకరిని కూడా లేపండి. తద్వారా వారికి ఒకే సమయం అలవాటు అవుతుంది.
కవల పిల్లలు కాబట్టి వారికీ ఒకేసారి దంతాలు, అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మొదటిలో కాస్త కష్టంగా అనిపిస్తుంది. కానీ వారు పెద్దయ్యాక, కొన్ని అలవాట్లు  ఒకే సారి  ఉండడం వలన మీకు పని తేలిక అవుతుంది.సాధారణంగా పిల్లలు పుట్టాక తల్లులు చాలా బిజీ అయిపోతారు. పిల్లల ఆలన పాలన చూసుకుంటూ ఉంటారు. అదే కవలలు అయితే మరింత జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇద్దరు పిల్లలను ఒకసారే చూసుకోవడం చాలా కష్టం. దీంతో భాగస్వామితో ఉండటానికి సమయం ఉండదు. ఈ సమయంలో ఇరువురి మధ్య దూరం ఏర్పడతుంది. ముఖ్యంగా కవలలు ఉన్న జంటలు విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నందున, మీరు ఒకరికొకరు సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం.శృంగారానికి ప్రాధాన్యత ఇవ్వండి.తల్లిగానే కాదు  భార్యగా కూడా  మీ బాధ్యతని నెరవేర్చండి.
వీలైతే అప్పుడప్పుడు బయటికి వెళ్లటానికి ప్రయత్నించండి. లేదా  ఇంటిలో  కలిసి  గడిపేందుకు సమయాన్ని కేటాఇంచుకోండి . ఏదైనా పరిస్థితి లో భార్య సమయం కేటాయించలేకతే అర్ధం చేసుకుని భార్యకి తోడుగా నిలబడడం భర్త భాద్యత అని మరువకండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri