గుండె నొప్పి అనేది .. ఎవరికి ఎప్పుడు ఎలావస్తుందో ఎవరికీ తెలీదు. ఒకప్పుడు కనీసం 60ఏళ్లు వచ్చాకే హార్ట్ ఎటాక్ వచ్చేది. కానీ.. ప్రస్తుతం పరిస్థితులుఆలా లేవు. మార్పు చెందుతున్న జీవన విధానం , ఆహారపు అలవాట్ల వలన చాలా మంది లో కనీసం 35 ఏళ్ళు కూడా రాకముందే దీని కి గురి అవుతున్నారు . గత 20 ఏళ్లుగా గుండే నొప్పి కి గురిఅవుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు.
చాలా కొద్ది మంది గుండె నొప్పి వచ్చినా తర్వాత .. కోలుకుంటున్నారు. కొందరైతే వెంటనే ప్రాణాలువిడుస్తున్నారు. ఇంట్లో మానసిక ఒత్తిడి పని ఒత్తిడి, ఇలాఅనేక కారణాల వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అయితే.. గుండెనొప్పి రావడానికి నెల ముందే.. దీనిని లక్షణలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏమిటో చూద్దాం…గుండె నొప్పి రావడానికి సరిగ్గా నెల ముందు నుంచే శ్వాసతీసుకోవడంలో సమస్య గా ఉంటుందట.శ్వాస తొందరగా తీసుకోలేరట.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గానీ మొదలయ్యిందంటే.. గుండెకి ఆక్సీజన్ సరైన స్థాయిలో అందడం లేదని అర్థంగుండె నొప్పి రావడానికి కొద్ది రోజుల ముందు జలుబు, జ్వరం లాంటివి వస్తాయట.గుండె అంతా ఒత్తిడిగా అని పించడం తెలుస్తుంది.గుండె నొప్పి రావడానికి ముందు గుర్తించాల్సిన మొదటి లక్షణం ఒత్తిడేనట… కొద్ది దూరం నడిచినా కూడా వెంటనే అలిసిపోవడం.. చాలా అలసిపోయినట్టు అనిపించడం జరుగుతుందట. శరీరం మొత్తానికి రక్త ప్రసరణ సరిగా జరగదట.
చేతులు నొప్పులు గా అనిపిస్తాయట.ఊరికే చెమటలు పట్టడం,తలనొప్పి రావడం వంటివి జరుగుతాయి.నిద్రపోయినా కూడా అలసట తీరినట్టు అనిపించదు .ఒకవేళ ఈ లక్షణాలు గాని కనిపిస్తేనిర్లక్ష్యం చేయవద్దు.. ఇవన్నీ.. గుండె నొప్పికి ముందు కనిపించే లక్షణాలు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండడం మంచిది.