NewsOrbit
హెల్త్

శృంగారం లో ఇంతకుముందు లా లేరా? దానికి కారణం ఇదే!!

శృంగారం లో ఇంతకుముందు లా లేరా? దానికి కారణం ఇదే!!

ఆడవాళ్ళలో లాగ మగవాళ్లలో కూడా మెనోపాజ్ ఉంటుందని చాలామందికి తెలియదు..  ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.  దీన్ని ఆండ్రోపాజ్అని పిలుస్తారు… మగవాళ్ల లో ఉండే  హార్మోన్ల లో కూడా మార్పులు ఉంటాయన్న  విషయం చాలామందికి తెలియదు.

శృంగారం లో ఇంతకుముందు లా లేరా? దానికి కారణం ఇదే!!

హార్మోన్ల తేడావల్ల స్త్రీల శరీరంలోనే కాదు,మగవారి  శరీరంలోనూ మార్పులు కలుగుతాయి… 50ఏళ్ళ  తరువాతమగవారిలో కూడా ఈ హార్మోన్ల మార్పులు వస్తాయని తాజా  అధ్యయనాల్లో బయట పడింది. అయితే ఇది ఆడవారిలో  కంటే చాలా భిన్నం గా ఉంటుందని అంటున్నారు. మగవాళ్లలో కనిపించే ఈ హార్మోన్ మార్పులు  ని ఆండ్రోపాట్ అంటారు. దీనివల్ల మగవారి  శరీరం లో టెస్టోస్టిరాన్ స్థాయి తక్కువగా ఉంటుంది.

ఈ హార్మోన్ మగవారి యొక్క  మగతనానికి చాల  ముఖ్యమైనది అవ్వడం తో పాటు.. మగవారి లో  యుక్తవయసు లో వచ్చే  మార్పుల కు ప్రధాన కారణం గా చెప్తారు . మంచి లైంగిక సామర్థ్యం కలిగి ఉండడానికి  మూలం ఈ హార్మోనే అని చెప్పవచ్చు. …టెస్టోస్టిరాన్ స్థాయితగ్గి ఆండ్రోపాజ్ దశకు చేరుకున్నామని కొన్ని లక్షణాల ద్వారా తెలుస్తుంది.

హఠాత్తుగా బరువు పెరుగుతుంటే  ఇది ఆండ్రోపాజ్ లక్షణం కావచ్చు. ఎందుకంటే టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గినప్పుడు శరీరంలో కొవ్వుశాతం పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ మగవారి  పునరుత్పత్తి వ్యవస్థబాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఈ హార్మోన్ స్థాయి తగ్గడంతో, వీర్యకణాల సంఖ్యని , వాటి కదలిక సామర్థ్యాన్ని తగ్గించేస్తుంది. దాని కారణం గా  మగతనం తగ్గుతుంది. టెస్టోస్టెరాన్‌ తగ్గడం వల్ల జుట్టు రాలిపోయి బట్టతల ఏర్పడుతుంది. రొమ్ముల్లో మార్పులుకనిపిస్తాయి.

పురుషుల్లో రొమ్ములు చదును గా ఉండడానికి  కారణం ఈ హార్మోనే. ఎప్పుడైతే టెస్టోస్టిరాన్  తగ్గడం మొదలవుతుందో అప్పుడు మగవారిలో  వక్షోజాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. యాబై ఏళ్ల కు దగ్గరలో లో ఉన్నమగవారిలో  ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి అవసరమైన సలహాలు సూచనలు , చికిత్స తీసుకోవడం మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri