ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అనేక మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. స్థూలకాయం, ఒత్తిడి అధికంగా ఉండడం, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండడం, అస్తవ్యస్తమైన లైఫ్ స్టైల్‌ను కలిగి ఉండడం.. వంటి అనేక కారణాల వల్ల ఎప్పటికప్పుడు టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతూనే ఉన్నారు. అయితే వారు డాక్టర్ సూచించిన సలహా మేరకు మందులను వాడడంతోపాటు నిత్యం వ్యాయామం చేయాలి. అలాగే సరైన పోషకాలు కలిగిన ఆహారాలను నిత్యం సమయానికి తీసుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇక టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు.
1. యాపిల్స్
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు యాపిల్ పండ్లను నిత్యం తినాలి. వీటిలో ఉండే క్వర్సెటిన్ అనబడే సమ్మేళనం శరీరంలో ఇన్సులిన్ తయారీని ప్రోత్సహిస్తుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు తగ్గుతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. యాపిల్స్ ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
2. బెర్రీలు
స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీలు, బ్లూబెర్రీలను టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి సూపర్ ఫుడ్స్‌గా చెప్పవచ్చు. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను కలిగిస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్.. శరీరం గ్లూకోజ్‌ను నెమ్మదిగా శోషించుకునేలా చేస్తాయి. అందువల్ల షుగర్ లెవల్స్ పెరగవు. దీంతో డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది.
3. బీన్స్, పప్పులు
వీటిలో ఉండే ఫోలేట్, పొటాషియం, ఐరన్, మెగ్నిషియం అనే పోషకాలు షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. నిత్యం బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కొద్ది రోజులకు షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లోనూ వెల్లడైంది.
4. పాలకూర
పాలకూరలో విటమిన్ ఎ, ఫైబర్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇవి డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడమే కాదు, ఇతర ఆరోగ్యకర ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
5. బ్రౌన్ రైస్
బ్రౌన్ రైస్ తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. ఇతర అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో ఉండే ఫైబర్ డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. నిత్యం బ్రౌన్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. అందువల్ల నిత్యం బ్రౌన్ రైస్‌ను తింటే చాలా మంచిది.