29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
న్యూస్ హెల్త్

Kidney: కిడ్నీ ఫెయిల్యూర్ కి ఫెయిర్ నేస్ క్రీమ్ కారణమా.!? వైద్య పరీక్షలో తేలిన సంచలన నిజం..

That Fairness cream attacks kidney failure doctors tests
Share

Kidney: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. ఆ విషయంలో ఒక అడుగు ముందుంటారు.. అందం పెంచుకునేందుకు ఫెయిర్ నెస్ క్రీమ్స్ ను సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తూనే ఉంటారు.. అయితే వాటిలో ఉపయోగించే రసాయనాల వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు పదే పదే చెబుతున్నారు.. కాగా ఒక ఫెయిర్నెస్ క్రీమ్ కారణంగా కిడ్నీ దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

That Fairness cream attacks kidney failure doctors tests
That Fairness cream attacks kidney failure doctors tests

తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన ఒక్కసారిగా అందర్నీ షాక్ కి గురి చేసింది. ముంబైకి చెందిన ఓ 20 ఏళ్ల అమ్మాయి ఇటీవల ఓ ఫెయిర్నెస్ క్రీమ్ ను కొని వాడటం మొదలుపెట్టింది. ఆ క్రీం వాడుతుండడంతో అమ్మాయి అందంగా కనిపిస్తుందని అందరూ పొగడటంతో.. ఆ క్రీమ్ ను తన అక్క తో పాటు తల్లి కూడా ఉపయోగించారు. దాంతో ఈ క్రీం ఉపయోగించిన నాలుగు నెలల తర్వాత అమ్మాయి అనారోగ్యం పారిన పడింది..

Kidney Disease: మూత్రపిండాల వైఫల్యం లక్షణాలు, కిడ్నీ ఫెయిల్యూర్ కారణాలు, సంపూర్ణ రీనల్ హెల్త్ కోసం తీసుకోవాల్సిన ఆహారం

వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత తను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ పనితీరు దెబ్బతిన్నట్లు వైద్యులు నిర్ధారించరు. అయితే ఈ వ్యాధి ఎందుకు వచ్చిందన్న దానిపై పరీక్షలు నిర్వహించిన వైద్యులకు ఊహించని విషయాలు తెలిసాయి. అసలు కిడ్నీలో సమస్య ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి పరేల్ లోని కెఈఎం ఆసుపత్రికి శాంపుల్స్ పంపించారు. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ తుకారం జమాలే అకోలాకు చెందిన డాక్టర్ అమర్ సుల్తాన్లు పరీక్షలు నిర్వహించిన తర్వాత కిడ్నీ సమస్యకు ఆమె ఉపయోగిస్తున్న ఫెయిర్ నెస్ క్రిమే కారణమని నిర్ధారణకు వచ్చారు.

ఫెయిర్నెస్ క్రీమ్ తయారీలో పరిమితకు మించి ఉపయోగించిన మెర్క్యూరీ కారణంగానే కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. సాధారణంగా మనుషుల రక్తంలో మెర్క్యూరీ స్థాయిలు 7 కంటే తక్కువ ఉండాలి. కానీ ఆ అమ్మాయి రక్తంలో మాత్రం ఆ సంఖ్య ఏకంగా 46 గా ఉండడం గమనార్హం. మెర్క్యూరీ కిడ్నీలపై నేరుగా ప్రభావం చూపుతుంది అయితే ఫెయిర్నెస్ క్రీమ్స్ లో ఇలాంటి మెటల్స్ కనుగొనడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు హెవీ మెటల్స్ ఉన్నట్లు 32 క్రీములు గుర్తించారు.


Share

Related posts

Wife: భర్త చీట్ చేస్తున్నాడని ఓ వినూత్న రీతిలో అతడి పరువు తీసిందో భార్య !! ఎలా అంటే..

Naina

Vivekananda reddy: వివేకా హత్య కేసులో ఆ ఎంపీ చుట్టూ సాక్షాలు – ఆధారాలు..

Srinivas Manem

Daily Horoscope : జూన్‌ 15 సోమ‌వారం మీ రాశి ఫలాలు

Sree matha