మీ డైజెస్టివ్ హెల్త్ బాగోక పొతే సహజంగా ఉండే ఈ టీ ని తాగి సరిచూసుకోండి . అల్లం, లవంగాలు ఆరోగ్యానికిచాలా మేలు చేస్తాయి.
అయితే అల్లం, లవంగాలను పచ్చిగా తినలేం అనుకునేవారికి వాటిని టీ ద్వారా తీసుకోవడం చక్కటి పరిష్కారం. ‘టీ’ అనేది మన జీవితంలో తప్పనిసరి అయిపోయింది. అయితే మాములు టీ కి బదులు అల్లం,లవంగాల టీ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండచ్చు. ఎసిడిటి , జీర్ణ సమస్యలను కూడా నివారించవచ్చు. అయితే ఈ టీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం…
ముందుగా ఒక గిన్నెను తీసుకోండి , అందులో కొద్దిగా నీరు తీసుకొని ఒక అంగుళం పొడవు ఉన్న అల్లం, మరియు 3-4 లవంగాల ను కొంచెం కచ్చా పచ్చా గా దంచి ఆ నీటిలో వేసి కాసేపు స్టవ్ మీద పెట్టి మరిగించి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉండనివ్వండి.
తరువాత ఆ నీటిని వడకట్టితాగండి . కావాలనుకుంటే రుచికి ఒక టీస్పూన్ తేనె వేసుకోవాలి . అయితే తేనె స్టవ్ మీద నీరు మరుగుతున్నప్పుడు వేయకూడదు, మరిగించిన నీటిని వడకట్టిన తరువాత అందులో వేసుకోవాలి. ఇలా తయారైన టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ టీ వల్ల ఆరోగ్యం వస్తుంది కదా అని ఎక్కువ సార్లు తాగకూడదు. రోజుకు 2-3 సార్లు మాత్రమే ఈ టీ ని తీసుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది .