Girls: మన దేశం లో 25 ఏళ్ల తర్వాత కూడా అమ్మయిలు పెళ్లి కకాకపోతే చుట్టాలు , తెలిసినవాళ్లు ఇలా ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోమని నసపెడుతుంటారు. తెలిసిన వాళ్ళ అబ్బాయి ఉన్నాడని.. ఒకసారి కలిసి మాట్లాడమని సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అందరు తెలుసుకోవాలిసిన సంగతి ఒకటి ఉంది.. పెళ్లి చేసుకున్న వారితో పోలిస్తే పెళ్లి కాని వారే ఎక్కువ ఆనందంగా ఉన్నారట. అలాగే తమ జీవితాన్ని చివరి వరకు తృప్తి గా గడుపుతారట.
ఈ విషయం తాజాగా జరిగిన ఓ పరిశోధనలో బయటపడింది .మగవారికి పెళ్లి అయితే వారి బాధ్యతలు తగ్గుతాయి. చాలా తక్కువ రిస్క్ తీసుకుంటారు. తక్కువ గా భాద్యతలు తీసుకోవటం వలన ఆఫీస్ పని మరింత నైపుణ్యం తో చేసి ప్రమోషన్స్ పొంది ఎక్కువ సంపాదిస్తారు. ఇవన్నీ వారికీ ఆనందాన్ని కలిగిస్తాయి.కానీ ఆడవారు మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లు, పిల్లలతో పాటు వర్కింగ్ ఉమెన్ అయితే ఆఫీస్ బాధ్యతలు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.
అయితే గర్భం ధరించడం, పిల్లలు వంటి కారణాల వల్ల వారు కెరీర్లో అనుకున్న విధం గా దూసుకుపోలేరు. జీతం అనుభవించడం లో కూడా తేడా ఉంటుంది. ఈ కారణాల తో వారు అసంతృప్తితో జీవితం గడుపుతున్నారు. అందుకే ప్రపంచంలో నే ఆనందకరమైన వారెవరంటే పెళ్లి చేసుకోని అమ్మాయిలే అని అంటున్నారు నిపుణులు.ఈ కారణాలన్నింటి నీ దృష్టిలో ఉంచుకొని “అమ్మాయిలు ఒక వయస్సు కి వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి” అంటూ సమాజంలో అందరి మెదడులో పాతుకు పోయి ఉన్న ఆలోచన మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని నిపుణులు తెలియచేస్తున్నారు.