మ్యూజిక్ ని వినని వాళ్లంటూ ఈ రోజుల్లో ఎవరు ఉండరు. పిల్లల దగ్గరనుంచి వృద్ధుల వరకు ఎవరికి ఇష్టమైన సంగీతాన్ని వారు వింటుంటారు.
మ్యూజిక్ వినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఒత్తిడిని తగ్గించడం, కొన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడం, మానసిక ఉత్తేజం కలిగించడం, ఇలా ఎన్నో రకాలుగా మన నిత్యజీవితంలో సంగీతం ఉపయోగపడుతుంది. ఇన్ని అద్భుతాలు చేయగలమ్యాజిక్, మ్యూజిక్ లో ఉంది. ఒత్తిడి అనేది ఈ రోజుల్లో అందరికీ సర్వసాధారణమైపోయింది. ఇష్టమైన పాటలు వినడం తో దీన్ని అధిగమించవచ్చు. ఒత్తిడిని పోగొట్టే మహా మంత్రంగా మ్యూజిక్ ని ఉపయోగిస్తున్నారు. మ్యూజిక్ వినటం వంటి అలవాటు ఉంటే ,నిజంగా మీరు అదృష్టవంతులు.ఆనందాన్ని ఆశ్వాదించడానికైనా, ప్రశాంతతను కోరుకోవడానికైన మ్యూజిక్ వినడం ఓ మంచి అలవాటు. మ్యూజిక్ కి మన బ్రెయిన్ కి ఒక లింక్ ఉంది.చక్కటి మ్యూజిక్ వింటున్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం. అదే గంభీరమైన రెచ్చగొట్టే మ్యూజిక్ వింటే రెచ్చిపోతాం. కారణం మన బ్రెయిన్ ఆలోచనలు ఆ సాంగ్తో మిక్స్ అవుతాయి. అందువల్ల మనం మంచి సాంగ్స్, చక్కటి మ్యూజిక్ వినటంవల్ల మన టెన్షన్లను తగ్గిస్తుంది. మరియు బ్రెయిన్లో కణాలను ఉత్తేజ పరుస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా నొప్పులను తగ్గించి మహాశక్తి సంగీతానికి ఉంది. ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నా, రోజూ కొంతసేపు నచ్చిన సంగీతం వినడం వల్ల ఒత్తిడి నుంచి వచ్చే చెడు ప్రభావం ఉండదని కొన్ని పరిశోధనలు నిరూపించాయి.వివిధ రకాల సర్జరీలు చేయించుకున్నవారు సంగీతంతో ఉపశమనాన్ని పొందవచ్చట. బరువు తగ్గాలి అనుకునే వారు వారికి ఇష్టమైన సంగీతం వింటూ వ్యాయామం చేయడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. రోజంతా పని ఒత్తిడితో గడిపేవారు రాత్రి పడుకునే ముందు చక్కని సంగీతం వింటే ,ప్రశాంతంగా నిద్ర పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందుకే మ్యూజిక్ ఒక మ్యాజిక్ అన్నది.