కరోనా వచ్చిన 80శాతం మందిలో అదే రోగం!

కరోనా మహమ్మారి రాకతో ప్రపంచ దేశాలన్నీ బయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత సోషల్ డిస్టెన్స్ పాటించినా, ఎన్ని మాస్కులు వాడినా, శానిటైజర్ ను ఎంత రాసుకున్నాఏం ఫలితం లేకుండా పోతోంది. ఎంతో మంది ఈ మహమ్మారిన భారిన పడుతూనే ఉన్నారు. దీని ధాటికి ఎంతో మంది ప్రాణాలను కూడా విడుస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న వారికి కరోనా వచ్చినా పెద్ద సమస్య ఏమీ లేదు కాని.. అనారోగ్యంగా ఉన్న వారే దీనికి బలైపోతున్నారు. అందుకే డాక్టర్లు మంచి ఆహారం తీసుకుంటూ ఇమ్యునిటీ శక్తిని పెంచుకోవాలని సలహాలిస్తున్నారు.

 

కాగా కరోనా బారిన పడుతున్న80 శాతం మందిలో ‘డీ’ విటమిన్ లోపం ఉందని స్పెయిన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 216 మందిని పరిశీలించిన ఈ అధ్యయనంలో 80 శాతం మందికి వారి రక్తంలో డీ విటమిన్ తగినంత స్థాయిలో లేదని తేలిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకారం తగినంత డీ విటమిన్ లేకపోవడం మూలంగా కరోనా రోగులకు వ్యాధి ముదిరి చనిపోయే ప్రమాదం 51.5 శాతం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజంలో కొత్త అధ్యయనంలో భాగంగా పరిశోధకులు216 మంది కోవిడ్ పేషెంట్లపై పరిశోధనులు జరిపారు. వీరిలో 82.2 శాతం మంది డీ విటమిన్ లోపం కలిగునట్లు వెళ్లడించారు. మరీ ముఖ్యంగా మహిళలతో పోలిస్తే పురుషులలోనే డీ విటమిన్ తక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు.

డీ విటమిన్ లోపం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటీస్, రక్తపోటు, ఊబకాయం వంటి కొమొర్జిడిటీలు డీ విటమిన్ తక్కువగా ఉన్నవారిలో వస్తాయని డీ విజమిన్, కరోనా ను అంచనా వేసిన హోహెన్ హీమ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ హన్స్ కొన్నాడ్ బీసాల్క్సీ చెప్పారు. అలాగే డీ విటమిన్ లోపించిన వారి రక్తప్రసరణ వ్యవస్థలో కీలక మార్పులు జరిగినట్లు గుర్తించారు.