Angry: సాధారణంగా కొన్ని కొన్ని విషయాలలో ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది.. ఇది సహజమే.. అయితే కొందరిలో మాత్రం చిన్న చిన్న విషయాలకు కూడా కోపం వస్తుంది.. కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం.. కొన్ని ఆహారాలు కోపాన్ని పెంచుతాయి. మరికొన్ని ఆహారాలు కోపాన్ని తగ్గిస్తాయి.. అయితే కోపాన్ని తగ్గించడానికి ఏ ఏ ఆహార పదార్థాలు ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!
మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే కూడా కోపం వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహార పదార్థాలు మీ డైట్లో భాగం చేసుకోండి. సిట్రస్ ఫ్రూట్స్, వెల్లుల్లి, డ్రై ఫ్రూట్స్, నిమ్మ, ఆకుకూరలు తరచు తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మన శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే కోపం వస్తుందట. కాబట్టి ప్రతిరోజు ఉదయం ఒక గంట కాసేపు ఎండలో కూర్చోండి. దాంతో శరీరానికి కావలసిన విటమిన్ డి అందుతుంది. ఈ విధంగా కోపం తగ్గుతుంది. వీటితో పాటు వాకింగ్, వ్యాయామం, ధ్యానం, యోగా వంటివి కూడా కోపాన్ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతాయి.
కోపాన్ని నియంత్రించడంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అద్భుతంగా సహాయపడుతాయి. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. పైగా వీటిలో మంచి కొలెస్ట్రాల్ లభిస్తుంది. వారంలో రెండుసార్లు మీ డైట్ లో చేపలు ఉండేలా చూసుకుంటే కోపం రాదు. ఇంకా గుడ్లు, బాదం పప్పులు, వాల్ నట్స్ లో కోపాన్ని తగ్గించే గుణాలు ఉన్నాయి. వీటిలో ఉండే పోషకాలు తీవ్రమైన కోపాన్ని తగ్గించడం లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంకా మన శరీరంలో ఉండే డోపమైన్ అనే హార్మోన్ కూడా కోపం కంట్రోల్ చేయగలదు. ఈ హార్మోన్ పెరుగుదలకు పుట్టగొడుగులు, చికెన్, చేపలు, గుడ్లు సహాయపడతాయి. వీటితోపాటు గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.