Heart Attack: మన జీవన విధానం ఆహారపు, అలవాట్లు కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.. ముప్పై వయసులో కూడా గుండె పోటు వస్తుంది.. అయితే కొన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ వారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.. ఏ ఏ బ్లడ్ గ్రూప్స్ వారికి ఈ ప్రమాదం ఉందో.. ఏ గ్రూప్స్ వాళ్ళకి రిస్క్ తక్కువో ఇప్పుడు తెలుసుకుందాం..!
హార్ట్ ఎటాక్ సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి పరిశోధకులు పలు అధ్యయనాలు చేసి ఈ విషయాలను వెల్లడించారు.. కొన్ని రకాల బ్లడ్ గ్రూప్ వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ఏ, బీ బ్లడ్ గ్రూప్ లో ఉన్నవారికి ఈ థ్రోంబోసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తసరఫరా సక్రమంగా జరగదు. గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడటాన్ని థ్రోంబోసిస్ అంటారు. దీని వలన అనేక రకాల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి..
యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ గా పిలవబడే O గ్రూప్ వారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే మిగతా అన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ వారు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఆహారాన్ని మాత్రమే తినాలి. ఆయా సీజన్లలో లభించే పండ్లు, కూరగాయలు మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. వీటితోపాటు ప్రశాంతంగా నిద్ర పోవాలి. ఒత్తిడి కలిగించే వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ప్రతి రోజు వ్యాయామం చేస్తూ ఉండాలి.