న్యూస్ హెల్త్

Pigmentation: పిగ్మెంటేషన్ కు ఈ ఫేస్ ప్యాక్ లతో బై బై చెప్పేయండి..! 

Share

Pigmentation: ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న కామన్ ప్రాబ్లం పిగ్మెంటేషన్.. దీనివలన చర్మం నిగారింపుపోయి నిర్జీవంగా తయారవుతుంది.. అంతేకాకుండా మచ్చలు కూడా ఏర్పడతాయి.. ఆ మచ్చల కారణంగా ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది.. పిగ్మెంటేషన్ సమస్యకి బాగా ఖరీదైన ప్రొడక్ట్స్ మాత్రమే వాడనవసరం లేదు.. చిన్న చిన్న ఇంటి చిట్కాలు కూడా గొప్ప ఫలితాలను ఇస్తాయి.. పిగ్మెంటేషన్ కు చెక్ పెట్టడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..!

These face Packs To Check Pigmentation:
These face Packs To Check Pigmentation:

రెండు స్పూన్ల శనగపిండి, ఒక చెంచా గంధపు పొడిలో చిటికెడు పసుపు, రెండు స్పూన్లు పాలు తీసుకుని వీటన్నింటినీ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే మోము ఉన్న మచ్చలు తొలగిపోతాయి. ముఖంపై మచ్చలను తొలగించడానికి బంగాళదుంప రసం అద్భుతంగా సహాయపడుతుంది. బంగాళదుంపను తొక్కతీసి ఆ రసాన్ని మచ్చలు ఉన్న చోట అప్లై చేసి ఆరిన తరువాత కడిగేస్తే.. పిగ్మెంటేషన్ త్వరగా తగ్గుతుంది. ఒక చెంచా పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం పై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

These face Packs To Check Pigmentation:
These face Packs To Check Pigmentation:

ఒక చెంచా కొబ్బరి పాలలో చిటికెడు పసుపు కలిపి ముఖానికి మెడకు రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది. ఒక చెంచా యాపిల్ సిడర్ వెనిగర్ లో ఒక స్పూన్ నీటిని కలిపి పిగ్మెంటేషన్ ఉన్న చోట అప్లై చేయాలి. ఆరిపోయిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తూ ఉంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.


Share

Related posts

Karthika Deepam Mar16 Today Episode: హిమను అనాథను చేసిన సౌర్య.. మరోపక్క ఆనంద్ మోనిత కొడుకు అని తెలుసుకున్న హిమ ఏమి చేయనుంది.?

Ram

కరోనా విషయం లో చైనా అడ్డంగా దొరికింది .. ప్రూఫ్స్ తో సహా .. !

sekhar

Corona Virus: 66 రోజుల తర్వాత.. దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు..!

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar