Liver: మన శరీరంలోని అతి పెద్ద అవయవం కాలేయం..! సుమారు ఐదు వందల రకాలకు పైగా విధులను నిర్వహిస్తుంది.. ఆహారంలోని కొవ్వులను వేరుగా చేసి శక్తిగా మారుస్తుంది.. జీర్ణ శక్తికి అవసరమైన పైత్యరసాన్ని నిరంతరం స్రవిస్తుంది.. రక్తంలోని హిమోగ్లోబిన్ కణాల నుంచి శరీరానికి అవసరమైన ఇనుము తయారు చేస్తుంది.. శరీరంలో విడుదలయ్యే హానికరమైన విషత్యుల్యాలను వేరుచేస్తూ మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.. కాలేయం ఊరికే దెబ్బతినదు.. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి.. ముఖ్యంగా మన ఆహార నియమాలు.. ఎటువంటి ఆహారం తీసుకుంటే కాలేయం దెబ్బతింటుందో ఇప్పుడు తెలుసుకుందాం..!

తినడానికి జంక్ ఫుడ్ రుచికరంగా ఉంటాయి. కానీ కాలేయం తో సహా శరీరంలోని అన్ని అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి.. పిజ్జా , బర్గర్, నూడిల్స్ ఇలాంటి జంక్ ఫుడ్స్ సాధ్యమైనంత దూరంగా ఉండాలి.. వీటి వాసనలు తినాలనిపించే ఎలా చేస్తాయి.. కానీ వీటిని తింటే మాత్రం ఫ్యాటీ లివర్ సమస్య బారిన పడటం ఖాయం. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా క్షీణిస్తుంది. దాంతో ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకింగ్ ఫుడ్స్ కు దూరంగా ఉంటే మంచిది. స్వీట్స్ కూడా మన ఆరోగ్యానికి హానికరం. తినడానికి రుచికరంగా ఉంటాయి. కానీ స్వీట్స్ అధికంగా తినటం వల్ల కాలేయం తొందరగా దెబ్బతింటుంది.

చాలామంది నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు కానీ నాన్ వెజ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ, కాలేయం ఇతర భాగాల్లో కొవ్వు పేరుకు పోతుంది. ఫలితంగా కాలేయం ఆరోగ్యం క్షీణిస్తుంది. వారానికి ఒక్కసారి మహా అయితే రెండుసార్లకు మించి రెడ్ మీట్ తినొద్దు.. మాంసాహారం అతిగా తింటే ముప్పని ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు..