Health: ఆరోగ్యానికి మంచి చేసేవాటిలో పెరుగు కూడా ఒకటి . అయితే పెరుగు తో కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడయితే.. మరి కొన్ని పదార్థాలు కలిపి తీసుకోవడం వలన మంచి జరుగుతుంది. ఇలా పెరుగు తో ఈ పదార్ధాలు కలిపి తీసుకుంటే చాలా తేలికగా బరువు తగ్గడం తో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. పెరుగు లో ఐరన్,క్యాల్షియం,విటమిన్ బి6, విటమిన్ బి12, రైబోఫ్లెవిన్, హెల్తీ బ్యాక్టీరియా మొదలైనవి ఉన్నాయి.
థైరాయిడ్ సమస్య తగ్గడానికి పెరుగు సోంపు పొడి కలిపి తీసుకోవాలి సొంపు లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల థైరాయిడ్ సమస్య నుండి బయట పడవచ్చు.మెంతుల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన ఆకలి తగ్గేలా చేస్తుంది. మెటబాలిజం పెరిగేలా చేస్తుంది . కొవ్వును కరిగించడంలో ఇది సహాయ పడుతుంది. అందుకే పెరుగు తో పాటు మెంతులు పొడి తీసుకుంటే బరువు తగ్గవచ్చు.
పెరుగు లో పసుపు వేసుకుని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ, ఫైల్స్ అదుపు చేయడానికి డైజషన్ బాగా జరగడానికి పెరుగు మంచి ఔషధంలా పనిచేస్తుంది. పెరుగు లో చలువ చేసే గుణం తో పాటు మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఇది అజీర్తిని తగ్గేలా చేస్తుంది.
కప్పు పెరుగులో కొంచెం నల్ల మిరియాల పొడి వేసుకుని తింటే ఆహారం బాగా జీర్ణమవుతుంది.
కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు పెరుగు లో ఆరెంజ్ జ్యూస్ కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది .పెరుగు లో కొన్ని ఎండు ద్రాక్ష వేసుకుని తింటే మగవారిలో వీర్యకణాల నాణ్యత పెరుగుతుంది అని ఓ పరిశోధనలో తేలింది. కొన్ని ఆహారాలు అస్సలు పెరుగుతో కలిపి తీసుకోకూడదు. వాటి గురించి తెలుసుకుందాం. పెరుగు, చేపలు 2. అరటి పండు, పెరుగు 3. పెరుగు, ఉల్లిపాయలు 4. పాలు, పెరుగు, ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు