జీవితం లో విజయా లు అందుకోవాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం దేవుణ్ని ప్రార్థిస్తారు. చాలా మంది పూజలు , పరిహారాలు చేస్తూ ఉంటారు. శివుడు అందరికంటే తేలికగా కరుణించే దేవుడంటారు. ముక్కంటి కటాక్షం పొందితే మాత్రం అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని చాలా మంది చెబుతారు. మీరు గనక శివుణ్ని పూజిస్తే… మీ కోరికలు తీరడమే కాదు… ఫలితాలు రెట్టింపులో వస్తాయంటున్నారు పండితులు. ఇందులో భాగంగా, ప్రతి సోమవారం తమలపాకులతో శివుడి కి పూజలు చెయ్యమంటున్నారు.
పూజకు వాడే తమలపాకుల్లో ఎక్కడా కన్నాలు ఉండకూడదనీ, అలా ఉంటే మంచి ఫలితం పొందలేరని గుర్తుపెట్టుకోవాలి. ఇలా తమలపాకులు వాడటం వల్ల మీ పై ఉన్న చెడు దృష్టిపోతుంది. మీరు ఎప్పుడు బయటకు వెళ్లినా మీ జేబులో లేదా పర్సు లో, తమలపాకు లు ఒకటి లేదా రెండు ఉంచుకోవాలి. ఎంత అత్యవసర పని అయినా వాటిని పెట్టుకోవడం మాత్రం మర్చిపోరాదు. ఎందుకంటే అవి మీరు చేసే పను ల్లో విజయం తెచ్చి పెట్టడానికి ఉపయోగ పడతాయని గుర్తు పెట్టుకోండి..అవి మీకు ఎంతో మనస్శాంతి కలిగిస్తాయని గుర్తు పెట్టుకోండి. ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారం లో చిక్కులు తొలగి పోయి సుఖం లబిస్తుంది.
వ్యాపారం లో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ తో కలిపి , దానం చేస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనిశ్వరుని అనుగ్రహం పొందడం జరుగుతుంది .
ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనైశ్చర దృష్టి ఉన్నవారు శనిశ్వరుని అనుగ్రహంపొందగలుగుతారు.