Meals: భోజనం విషయంలో  ఈ జాగ్రత్తలు అవసరం  !!

Share

Meals: భోజనం చేశాక కొన్ని పనులు చేయకుండా ఉండటం మంచిది అని  నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వలన  అనారోగ్య సమస్యలు తప్పవు  అని  అధ్యయనాల్లో తేలింది. అసలు  భోజనం తర్వాత చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. చాలామంది భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తూ ఉంటారు. అలా భోజనం తర్వాత వెంటనే స్నానం చేస్తే ఆహారం బాగా జీర్ణం కాదు. దీనివల్ల కడుపులో మంట వంటి సమస్యలు మొదలవుతాయి. అందుకే భోజనం చేసిన గంట తర్వాత  మాత్రమే స్నానం .

భోజనం చేసిన      వెంటనే నిద్ర పోవడం కూడా  మంచి పద్ధతి కాదు.  ఎందుకంటే  కడుపులో ఏమైనా ఆహారపదార్థాలు ఉంటే, వాటిని జీర్ణించుకోవడానికి, మన శరీరానికి, తగిన సమయం అవసరం  ఉంటుంది. నిద్రపోయిన తర్వాత, కొన్ని జీవక్రియలు మందగించడం వల్ల అది జీర్ణక్రియకు అంతరాయంగా మారుతుంది. ఈ కారణాలన్నింటి వల్ల తినగానే నిద్రపోతే    శరీర బరువు పెరుగుతుంది.చాలా మందికి పొగ తాగే అలవాటు ఉంటుంది.   భోజనం తర్వాత ఒక్క సిగరెట్ తాగితే 10 సిగరెట్ తాగినట్టు అవుతుంది. దీనివల్ల   క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది భోజనం తర్వాత పళ్ళు తినడం అలవాటు గా పెట్టుకుంటారు.    కానీ భోజనం అయిన వెంటనే పండ్లు తినకూడదు. దీనివల్ల  పొట్ట గాలితో నిండి అనేక సమస్యలకు కారణమవుతోంది.


కాబట్టి భోజనం చేసిన 2 గంటల తర్వాత మాత్రమే పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది. చాలా మంది జాబ్ చేసేవాళ్ళు ఆఫీస్ లో భోజనం  చేసేటప్పుడు బెల్ట్ ఉంచుకునే  భోజనం చేస్తారు. కానీ అలా చేయకూడదు.తినేటప్పుడు  పొట్టను నిర్భందిస్తే, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. తినే సమయంలో బెల్ట్ ను లూస్  చేసుకోవడం, లేదా పూర్తిగా తీయడం    మంచిదని నిపుణులు  సలహా ఇస్తున్నారు.అలాగే భోజనం చేసిన వెంటనే  వ్యాయామం కూడా  చేయకూడదు.  భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు కూర్చుని ఆ తర్వాత నెమ్మదిగా కొంత దూరం నడిస్తే ఇబ్బంది ఉండదు. కాఫీలు, టీలు తాగడం వంటివి అసలు చేయకూడదు.


Share

Related posts

ఆ అమ్మాయి ఏడిస్తే రక్త కన్నీరు వస్తుందట.. కారణం?

Teja

గ్రేట‌ర్ పోలింగ్ఃరేపు ఏం జ‌ర‌గ‌నుందంటే…

sridhar

Uppena : ఉప్పెన బుచ్చిబాబు కి ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్.. మైత్రీ మూవీస్ లో నిర్మాణం..?

GRK