ఈ స్నాక్స్ తింటే ఆరోగ్యం అద్భుతం గా ఉంటుంది..

ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ స్నాక్స్ తీసుకోండి. చాల మంది ఖాళీ సమయాల్లో, లేదా సాయంత్రం వేళల్లో లేదా ప్రయాణాల్లో స్నాక్స్ తింటూ ఉంటారు.కొంతమంది  ఏవి పడితే అవి తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి స్నాక్స్ ఆరోగ్యానికి  ఎలాంటి హాని చేయనివి తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం గా ఉంటారు. కాబట్టి తప్పకుండాఇవి ప్రయత్నించి చూడండి.

ఈ స్నాక్స్ తింటే ఆరోగ్యం అద్భుతం గా ఉంటుంది..

మంచి చిరు తిండి కావాలనిపిస్తే పాప్ కార్న్  ని  ఎంచుకోండి .అలాగే  ట్రిప్ లకు ప్రయాణాలకు, వెళ్ళేటప్పుడు పాప్ కార్న్ ని స్నాక్స్ గా దగ్గర పెట్టుకోండి .  పాప్  కార్న్ ఇంట్లోనే   మీకు నచ్చిన ఫ్లేవర్ కలుపుకుని టేస్టీగా చేసుకోవచ్చు.

మనలో చాలామంది స్నాక్స్ ను బయట  నుంచి కొని తెచ్చుకుంటారు . ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి కొద్దీ మొత్తం లో  మీరే ఇంట్లో తయారు చేసుకుని  తీసుకువెళ్లడం  మంచి అలవాటు. గుప్పెడు బాదం పప్పులు,నానబెట్టి పెట్టుకోండి.   పిస్తా తినడానికి రెడీ గానే ఉంటాయి..  ఇంకా , పల్లీలు వేపుకోండి వాటిలో ఉప్పు కారం వేసుకోండి లేదా వాటిని 7 గంటలు నానా బెట్టి కొంచెం ఉప్పు కలిపి ఉడికించి తీసుకువెళ్ళండి , వేపుకున్న సెనగలు కూడా పెట్టుకోవచ్చు .

ఇంకా తాజాపండ్లను  ను తీసుకు వెళ్లడం మాత్రం  మరిచిపోవద్దు. పండ్లు తేలిగ్గా జీర్ణమవుతాయి. తక్షణ శక్తిని ఇస్తాయి. దూరప్రయాణాలప్పుడు ఇవి బాగా పనికి వస్తాయి.  అయితే  ఈ మధ్య కోసిన పండ్ల ముక్కలు అమ్ముతున్నారు అవి మాత్రం తీసుకోకండి . ఎందుకంటే, వాటిని సరిగ్గా నిల్వ చేయకపోతే బాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. కాబట్టి తాజా పండ్లు తీసుకోండి. కేవలం ప్రయాణాల కు మాత్రమే కాదు ఇంట్లోకూడా స్నాక్స్ గా పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి రోజు పండ్లను తినడం అలవాటు చేసుకోవడం అనేది అవసరం.