Thigh Pain: పిక్కల నొప్పులు వస్తున్నాయా ఇలా చేస్తే మటుమాయం..!!

Share

Thigh Pain: చాలా మంది కాళ్ళ నొప్పి, పిక్కలు పట్టేయటం వంటివి సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఎక్కవగా రాత్రి సమయాల్లో పిక్కల్లో విపరీతమైన నొప్పి వస్తుంది. భరించలేని విధంగా వచ్చే పిక్క నొప్పి ఒక్కోసారి ఘాడ నిద్రను భంగం కలిగిస్తుంది. కండరాలను మెలితిప్పినట్లు అనిపించే నెప్పిని భరించటం చాలా కష్టతరంగా ఉంటుంది. అతిగా శ్రమించే వాళ్ళు, ఎక్కవ సేపు నిలబడటం, నడవటం, పొగ త్రాగే అలవాటు ఉన్నవాళ్ళు, ఒకే చోట కదలకుండా కూర్చునే వాళ్ళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. రక్తనాళాల్లో రక్త ప్రసరణ తగ్గడం, నరాల మీద ఒత్తిడి వంటి సమస్యల వల్ల పిక్కల నొప్పి వస్తుందని వైద్యులు చెబుతుంటారు. మన శరీరంలో మెగ్నిషియం లెవల్స్ తక్కువగా ఉన్నా కూడా ఈ నొప్పులు వస్తాయట.

Thigh Pain reduce Teknik
Thigh Pain reduce Teknik

పిక్కల నొప్పులు బాధపడుతున్న వారు కొన్ని జాగ్రత్త చర్యలు పాటించాలి. పిక్క కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఐస్ గడ్డలను కండరాలకు కాపడం పెట్టాలి. దీని వల్ల నొప్పి తగ్గించుకోవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు కాళ్ళ క్రింద దిండ్లు పెట్టుకుని కాళ్ళు ఎత్తులో ఉంచుకోవాలి. కాళ్ళు బాగా జాపి అటు ఇటు కదుపుతూ తేలకపాటి వ్యాయామాలు చేస్తే నొప్పులు తగ్గుతాయి. పాల కూర, పెరుగు, గుమ్మడికాయ విత్తనాలు, బాదం పప్పు, చేపలు, ఆకు కూరలు, కూరగాయలు వంటి ఆహార పదార్ధాలను తీసుకోవాలి. వీటిలో ఉండే మెగ్నీషియం వల్ల కండరాల నొప్పుల నుండి విముక్తి కలుగుతుంది. అదే విధంగా సొరకాయ, బూడిద గుమ్మడి కాయలను తింటే పిక్కల నొప్పులు మటుమాయం అవుతాయి. వాత దోషకారణంగానే పిక్కల నొప్పులు వస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. రక్త హీనత కూడా ఇలాంటి నొప్పులకు ఒక కారణంగా పేర్కొంటారు వైద్యులు.

 


Share

Related posts

‘దీన్ని ప్రజలు హర్షించరు’

somaraju sharma

వైద్య సిబ్బంది కి సంఘీభావంగా కొచ్చిలో నేవీ విన్యాసాలు

Siva Prasad

బ్రేకింగ్ : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి అంత్యక్రియలు ఎప్పుడు… ఎక్కడంటే…

Arun BRK