NewsOrbit
హెల్త్

పండ్లు కూరగాయలూ ఎలా పడితే అలా తినకూడదు .. ఇదిగో ప్లాన్ !

పండ్లు కూరగాయలూ ఎలా పడితే అలా తినకూడదు .. ఇదిగో ప్లాన్ !

ఏడాది పొడుగునా, అన్ని సీజన్స్ లోనూ దొరికే పండ్లూ కూరగాయలూ కొన్నైతే, సీజనల్ గా దొరికే పండ్లూ కూరగాయలూ కొన్ని. అరటి పండూ, జామ పండూ లాంటి పండ్లూ, బెండకాయలూ, అరటి కాయలూ లాంటి కూరలూ మనకి సంవత్సం పొడుగూనా పండుతాయి. మామిడి పండూ, సీతాఫలం లాంటి పండ్లూ, పెద్ద చిక్కుడు లాంటి కూరలూ ఒక సీజన్ లోనే వస్తాయి.

పుచ్చకాయల్లాంటివి ప్రస్తుతూం సంవత్సరమంతా సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నా అవి రావాల్సిన వేసవి కాలం లో వాటిని తింటే ఇంకా ఆరోగ్యం. బైట దొరుకుతున్నాయి కాబట్టి తినడం వేరూ, ఈ సీజన్ లో అవి తినాలి కాబట్టి తినడం వేరూ. ప్రకృతి ఒక పద్ధతి ప్రకారమే పని చేస్తుంది. మనకి డౌట్ ఉన్నప్పుడు ఆ పద్ధతిని ఫాలో అయిపోడమే. ఫ్రెష్ గా రుచి గా ఉండే ప్రోడక్ట్స్ తింటూ హెల్దీ గా ఉండచ్చు. ఎక్కడో దొరికేవో, వెరే దేశాల్లో పండేవో కాకుండా మనo నివిసిస్తున్న ప్రాంతం చుట్టు పక్కల పండే పంట తినడం ఎప్పుడూ ఆరోగ్యకరం. వేరే ప్రాంతాల నించి వచ్చే పంట ని ముందే కోసేస్తారు, దాని మీద పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అదే మన ప్రాంతాల్లో దొరికే పంట ఫ్రెష్ గా ఉంటుంది, రుచి గా ఉంటుంది. ఆరోగ్యకరమైనది.
ఉదాహరణకి పుచ్చకాయా, కర్బూజా లాంటి పండ్లని శీతాకాలం లో తింటే జ్వరాన్ని  పిలిచినట్లే. వాటిలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది, పొటాషియం, విటమిన్ ఏ, సీ తో సమృద్ధిగా ఉంటాయి. వాటిని వేసవి కాలం  లో తింటే శరీరం చల్లబడుతుంది, బైటి వేడిని తట్టుకుంటుంది. అలాగే, సమ్మర్ లో పరగడుపున మామిడి పండు తింటే బాడీ టెంపరేచర్ తగ్గుతుంది.ఏ సీజన్ లో ఏ పండ్లు, ఏ కూరగాయలు తింటే మంచిదో ఇక్కడ లిస్ట్ ఉంది. జనవరి పండ్లు – స్ట్రాబెర్రీస్, ద్రాక్ష, జామపండు, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్
జనవరి కూరగాయలు – వంకాయ, పాలకూర, టమటా, క్యాబేజ్, కాలీఫ్లవర్, కారెట్, ముల్లంగి, బీట్రూట్, బఠానీ, బ్రకోలీ, కాప్సికం

ఫిబ్రవరి పండ్లు – సపోటా, కర్బూజా, ద్రాక్ష, కమలా పండు, జామ పండు, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్, స్ట్రాబెర్రీస్
ఫిబ్రవరి కూరగాయలు – క్యాబేజ్, మెంతి కూర, కారెట్,ముల్లంగి, స్ప్రింగ్ ఆనియన్, కాప్సికం, బ్రకోలి

మార్చ్ పండ్లు – పుచ్చకాయ, పచ్చి మామిడి కాయ, తోతాపురి మామిడి, బాదామి మామిడి, ద్రాక్ష, కమలా పండు, పైనాపిల్, అరటి పండు, కర్బూజా, స్ట్రాబెర్రీస్

మార్చ్ కూరగాయలు – పాలకూర, మెంతి కూర, కాప్సికం, కారెట్, పొటల్స్/పర్వాల్, దొండకాయ, గుమ్మడి

ఏప్రిల్ పండ్లు – పుచ్చకాయ, పచ్చి మామిడి కాయ, తోతాపురి మామిడి, బాదామి మామిడి, చిన్న రసాలు,బంగినపల్లి మామిది, ద్రాక్ష, కమలా పండు, పైనాపిల్, అరటి పండు, కర్బూజా, స్ట్రాబెర్రీస్, పనస పండు
ఏప్రిల్ కూరగాయలు – బెండ కాయ, కీర దోసకాయ, దొండకాయ, కాకర కాయ, బీన్స్, పొటల్స్/పర్వాల్, గుమ్మడి, సొరకాయ

మే పండ్లు – పచ్చి మామిడి, ఆల్ఫాన్సో మామిడి, కేసర్ మామిడి, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి మామిడి, బొప్పాయి, నేరేడు పండు, లిచీ, పనస పండు, పుచ్చకాయ, కర్బూజా
మే కూరగాయలు – పాల కూర, కీర దోసకాయ, కాకర కాయ, బీన్స్, సొరకాయ

జూన్ పండ్లు – అల్ఫాన్సో మామిడి, కేసర్ మామిడి
జూన్ కూరగాయలు – పాలకూర, బెండ కాయ, కీర దోసకాయ, కాప్సికం, చిలగడ దుంప, అలసందలు, గోరు చిక్కుడు, సొరకాయ

జులై పండ్లు – తోతాపురి మామిడి, కేసర్ మామిడి, పీచ్ పండు, ఛెర్రీలు, ప్లంస్
జులై కూరగాయలు – పాలకూర, బెండ కాయ, కీర దోసకాయ, కాప్సికం, చిలగడ దుంప, అలసందలు, గోరు చిక్కుడు, సొరకాయ, పొట్లకాయ, కాకర కాయ

ఆగస్ట్ పండ్లు – అల్ఫాన్సో మామిడి, కేసర్ మామిడి, సీతా ఫలం
ఆగస్ట్ కూరగాయలు – పాలకూర, బెండ కాయ, కీర దోసకాయ, కాప్సికం, చిలగడ దుంప, అలసందలు, గోరు చిక్కుడు, సొరకాయ

సెప్టెంబర్ పండ్లు – జామ పండు, బొప్పాయి, దానిమ్మ, సీతా ఫలం
సెప్టెంబర్ కూరగాయలు – పాలకూర, బెండ కాయ, కీర దోసకాయ, కాప్సికం, చిలగడ దుంప, అలసందలు, గోరు చిక్కుడు, సొరకాయ

అక్టోబర్ పండ్లు – జామ పండు, బొప్పాయి, దానిమ్మ, సీతా ఫలం

అక్టోబర్ కూరగాయలు – వంకాయ, టమాటా, స్ప్రింగ్ ఆనియన్స్

నవంబర్ పండ్లు – కమలా పండు, ఖర్జూరాలు, జామ పండు, బొప్పాయి, దానిమ్మ, సీతా ఫలం
నవంబర్ కూరగాయలు – వంకాయ, టమాటా, స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్

డిసెంబర్ పండ్లు – స్ట్రాబెర్రీస్, కమలా పండు, బత్తాయి పండు, జామ పండు, సీతా ఫలం, పైనాపిల్
డిసెంబర్ కూరగాయలు – వంకాయ, టమాటా, స్ప్రింగ్ ఆనియన్స్, ముల్లంగి, బీట్రూట్

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri