Romance: భాగస్వామితో శృంగారం చేసేటప్పుడు పొందే ఆర్గాజమ్ మీకు ఆనందం ఇవ్వడం తో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అని కొన్ని అధ్యయనాలు సైతం నిర్ధారిస్తున్నాయి. భావప్రాప్తి కలిగినప్పుడు మెదడు సెరటోనిన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది మనలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆర్గాజమ్ పొందిన సమయంలో రక్తంలో కి ఆక్సిటోసిన్ విడుదల జరుగుతుంది. ఇలా జరగడం వలన టెన్షన్, ఒత్తిడి, ఇతర యాంక్సైటీ డిజార్డర్ ను తగ్గేలా చేయడం వలన ఉత్సాహంగా ఉంటాం. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది . కొన్ని రకాల అధ్యయనాల ద్వారా తెలిసింది ఏమిటంటే ,ఆర్గాజమ్ వల్ల కటి ప్రదేశంలో రక్త సరఫరా మెరుగుపడటం తో పాటు అవసరమైన చోటుకి పోషకాలు, హార్మోన్లు రక్తం ద్వారా సులభంగా చేరుకుంటున్నట్టు గుర్తించారు .
రెగులర్ గా శృంగారం చేయడం వలన జలుబు, ఫ్లూ వంటివి రావడం తగ్గుతుంది. మన వ్యాధి నిరోధక శక్తి 20 శాతం వరకు మెరుగవుతుంది. కానీ ఆరోగ్యం బాగా లేని సమయంలో మాత్రం శృంగారం చేయకుండా ఉండటం మంచిది.దీనికి కారణం మీ భాగస్వామి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది.శృంగారం చేసిన ప్రతిసారి కనీసం ఒక్కసారైనా ఆర్గాజమ్కి చేరుకుంటాము.ఈ ఆర్గాజమ్ వలన నొప్పులు తట్టుకునే శక్తి వస్తుంది.ఆర్గాజమ్ పొందినప్పుడు శరీరం వివిధ రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి మంచి నిద్ర పట్టేలా చేస్తాయి. అందుకే.. శృంగారం తర్వాత ఆదమరిచి నిద్ర పోతాం.
తరచూ శృంగారం చేయడం వలన మన జీవ గడియారం పనితీరు కూడా అద్భుతం గా మారుతుంది.ఆర్గాజమ్ పొందినప్పుడు చర్మానికి రక్త ప్రసరణ బాగా జరగడంతో పాటు చర్మానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా,మంచి రంగుతో ఉంటుంది. ఆర్గాజమ్ వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయి పెరిగి చర్మాన్ని కాపాడటం తో పాటు ఈస్ట్రోజెన్ కొల్లాజెన్ ఉత్పత్తి క్రమబద్ధం చేస్తుంది. దీనివల్ల చర్మానికి ముడతలు రాకుండా , మెరుపు పోకుండా కాపాడుతుంది.శృంగారం వలన బరువు తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు ఇప్పటికే రుజువు చేశాయి. ముఖ్యంగా నడుము, హిప్ భాగాల్లో పేరుకున్న కొవ్వు తగ్గుతుంది. ఆర్గాజమ్ వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది. పీరియడ్స్ లేని రోజుల్లో వారానికి రెండు సార్లు శృంగారం లో పాల్గొంటే ఈ ఫలితాన్ని పొందవచ్చు అని సూచిస్తున్నారు నిపుణులు.