Categories: హెల్త్

నెయ్యిని వీళ్ళు అసలు ముట్టుకోకూడదు తెలుసా..?

Share

వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, పచ్చడి వేసుకుని తింటే అ రుచి వేరు కదా.. అలాగే పప్పు, నెయ్యి కాంబినేషన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలిసిన పనే లేదు. నిజానికి నెయ్యిలో ఎన్నో రకాల ఔషదగుణాలు దాగి ఉన్నాయి.అందుకే ప్రతి ఒక్కరు కూడా నెయ్యిని తినడానికి ఇష్టపడతారు.నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.

నెయ్యి తినడం వలన కలిగే ఉపయోగాలు :

నెయ్యిని తినడం వల్ల జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. గుండె కూడా చాలా ఫిట్ గా ఉంటుంది. అలాగే జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి.కానీ కొందరు మాత్రం నెయ్యికి దూరంగా ఉండటమే మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. మరి నెయ్యిని ఎవరెవరు తినకూడదోఅనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నెయ్యిని ఎవరెవరు తినకూడదో తెలుసా..?

కడుపునకు సంబంధించిన సమస్యలున్న వారు
నెయ్యిని అస్సలు తినకూడదు. కడుపు నొప్పి, అజీర్థి వంటి సమస్యలున్న వారు నెయ్యికి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, అజీర్థి వంటి సమస్యలున్న వారు నెయ్యిని తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.

లివర్ ప్రాబ్లెమ్స్ :

లివర్ సిర్రోసిస్ వ్యాధితో బాధపడేవారు నెయ్యికి దూరంగా ఉండాలి. ఈ వ్యాధితో బాధపడేవారికి ఆరోగ్యకరమైన కాలేయ కణజాలం దెబ్బతినడంతో కాలేయం శాశ్వతంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. అందుకే ఇలాంటి సమయంలో నెయ్యిని తినకూడదు.

హార్ట్ పేషెంట్స్:

నెయ్యి తినడం వలన కొవ్వు పెరిగే అవకాశలు ఎక్కువగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగే కొద్ది గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే నెయ్యిలోని కొవ్వు ఈ కొలెస్ట్రాల్ ను మరింత పెంచుతుంది.

దగ్గు, జలుబు ఉన్నవారు :

దగ్గు, జలుబు సమస్యతో బాధపడే వారు నెయ్యికి దూరంగా ఉండాలి. దగ్గు, జలుబు ఉన్నవాళ్లు నెయ్యి తింటే గొంతు నొప్పి ఎక్కువ అవుతుంది.అలాగే సీజనల్ ఫీవర్ తో బాధపడేవారు కూడా నెయ్యిని తినకూడదు. అలా నెయ్యి తినడం వలన దగ్గుతో పాటుగా జ్వరం కూడా ఎక్కువ అవుతుంది.

 

 

 

 

 


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

13 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago